Manchu Manoj : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంపకాల గురించి మొదలైన గొడవలు కాస్త ఇప్పుడు రోడ్డెక్కాయి. తండ్రి కొడుకుల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటుంది. ఒకరిపై మరొకరు కేసు పెట్టుకోవడంతో ఈ గొడవలు బయటపడ్డాయి. మొన్నటివరకు గుట్టుగా ఉన్న గొడవలు కాస్త ఇప్పుడు అందరి నోట్లో నానుతున్నాయి. అయితే వీళ్ల గొడవలు ఏమో గాని మీడియా ప్రతి నిధి పై జరిగిన దాడి తో మోహన్ బాబు కేసు నమోదు అయ్యింది. ఆ కేసు ఇప్పటికి ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా మంచు మనోజ్ ను తిరుపతి పోలుసులు అరెస్ట్ చేశారనే వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. అసలేం జరిగింది? మంచు మనోజ్ అరెస్ట్ ఎందుకు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గత కొన్నిరోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. అయితే మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిన్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు నారా లోకేష్ ఈరోజు కుటుంబంలో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనోజ్ ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ నటుడు మంచు మోహన్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు పోలీస్ స్టేషన్ మెట్లేక్కడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య పెద్ద వార్ జరుగుతుంది. పోలీసు కేసులు పెట్టుకోవడంతో ఈ కేసు లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇటీవల మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేశాడని మరో కేసు నమోదు అయ్యింది. దాంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇకపోతే కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యిన ఈ గొడవలు మళ్లీ వార్తల్లో నిలిచాయి. ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. కాగా, తాజాగా మరోసారి తిరుపతి చేరుకొన్న మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను బాకారావుపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మనోజ్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు పూర్తి వివరాలను బాకారావుపేట పోలీసులు మరి కాసేపట్లో బయట పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది..