BigTV English

OTT Movie : 10 దేశాల్లో బ్యాన్ అయిన సినిమా… ఇందులో అంతగా ఏముందంటే?

OTT Movie : 10 దేశాల్లో బ్యాన్ అయిన సినిమా… ఇందులో అంతగా ఏముందంటే?

OTT Movie : సాధారణంగా సినిమాలు కొన్ని అభ్యంతరకర సన్నివేశాల వల్ల ఎక్కడో ఒక చోట బ్యాన్ అవుతుంటాయి. అయితే  ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఏకంగా 10 దేశాలలో బ్యాన్ అయింది. నిజానికి ఇదొక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్. అయినప్పటికీ ఇలాంటి సినిమా ఏకంగా 10 దేశాలలో బ్యాన్ అవ్వడం అన్నది విచిత్రమే. మరి ఇన్ని దేశాలలో బ్యాన్ అయ్యేంతగా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి? ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు “ది షాడో స్ట్రెస్” (The Shadow Strays). ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా “జాన్ విగ్” లాంటి హాలీవుడ్ సినిమా తరహాలో ఉంటుంది. ఈ సినిమాలో అరోరా రిబెరో, హనా మలాసన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ యాక్షన్ మూవీకి టిమో త్జాజాంటో దర్శకనిర్మాతగా వ్యవహరించారు.


కథలోకి వెళ్తే…

ఓ షాడో సంస్థలో కోడ్ 13 అనే అమ్మాయి కిరాయి హంతకురాలుగా ఉంటుంది. అయితే ఆమె జపాన్ మిషన్ లో పాల్గొని భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సస్పెండ్ కావడంతో ఇంటికి తిరిగి వస్తుంది. పక్కింట్లో ఒంటరిగా ఉంటున్న ఓ 10 ఏళ్ల అబ్బాయికి హీరోయిన్ అండగా ఉంటుంది. అప్పటికే అతని తల్లి చనిపోతుంది. ఇక అప్పటినుంచి మళ్లీ జాబ్ లో చేరాలని గట్టిగా ట్రై చేస్తుంది. కానీ సదరు సంస్థ రెస్పాండ్ కాకపోవడంతో ఈ అమ్మడికి విపరీతంగా కోపం వస్తుంది. ఇలాంటి క్రమంలో ఓ డ్రగ్స్ ముఠా ఆ పదేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేయడంతో కోడ్ 13 అతన్ని రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది.

అయితే ఈ క్రమంలో చివరకు తన పని చేసిన సంస్థ ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసిందన్న విషయం బయటకు వస్తుంది. ఇంతకీ ఆ అబ్బాయిని సదరు సంస్థ ఎందుకు కిడ్నాప్ చేసింది? చివరికి హీరోయిన్ ఏం చేసింది? ఆ అబ్బాయిని కాపాడగలిగిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. అక్టోబర్ 17 నుంచి సుమారు రెండు గంటలు నిడివి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. పక్కా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుంది. కాకపోతే ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. ఇంగ్లీష్, హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే పది దేశాల్లో ఈ మూవీ బ్యాన్ అయ్యిందంటే ఇందులో ఉండే యాక్షన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ను లైక్ చేసేవాళ్ళు ఈ మూవీని చూస్తే మతి పోవటం ఖాయం. అంతలా ఈ మూవీలో  యాక్షన్ సీన్స్ ఉంటాయి.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×