BigTV English
Advertisement

Tollywood Movies : భారీ హైప్‌తో వచ్చి డిజాస్టరైన సినిమాలు.. పుష్ప 2 పరిస్థితి ఏంటి..?

Tollywood Movies : భారీ హైప్‌తో వచ్చి డిజాస్టరైన సినిమాలు.. పుష్ప 2 పరిస్థితి ఏంటి..?

Tollywood Movies : ఈ. మధ్య తెలుగులో వచ్చే ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వట్లేదు.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చి రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లు అయ్యాయి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టాయి. ఇక ఆలస్యం ఎందుకు భారీ హైప్‌తో వచ్చిన డిజాస్టరైన సినిమాలు ఏవో ఒక్కసారి గుర్తు చేసుకుందాం..


శక్తి..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.. ఆ సినిమా కథ కొత్తగా ఉన్నా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు .


లై.. 

నితిన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ లై. ఈ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించగా అతి పెద్ద డిజాస్టర్ గా కూడా నిలిచింది..

ఆరెంజ్.. 

రామ్ చరణ్ హీరోగా, జెనిలియా హీరోయిన్ గా నాగబాబు నిర్మాణంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.. ప్రస్తుతం రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నాడు..

బ్రహ్మోత్సవం.. 

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమాలలో స్థానం దక్కించుకుంది.

సర్దార్ గబ్బర్ సింగ్..

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ అయ్యింది.. ఆ మూవీకి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అజ్ఞాతవాసి.. 

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా కూడా టాప్ టెన్ అట్టర్ ఫ్లాప్ సినిమాలలో చోటు సంపాదించుకుంది.

రాధే శ్యామ్, సాహో.. 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఈ రెండు సినీమాలు కూడా ఉన్నాయి. ఈ మూవీస్ బాహుబలి తర్వాత వచ్చాయి. వీటితో పాటుగా ఆది పురుష్ సినిమా కూడా వచ్చింది.. ఈ మూడు సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యాయి.

ఇవే కాదు చిరంజీవి ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయ్యింది , విజయ్ దేవరకొండ లైగర్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, శాకుంతలం, సైరా నరసింహ రెడ్డి,కంగువ సినిమాలు భారీ బడ్జెట్ తో పాటుగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కథ సరిగ్గా లేకపోవడం తో ప్రేక్షకులను అంతగా మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 పైనే ఉంది.. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ పై రిలీజ్ కు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ఇది కూడా డిజాస్టర్ సినిమాల లిస్ట్ లోకి చేరుతుందనే అల్లు అర్జున్ యాంటి ఫ్యాన్స్ నెట్టింట ప్రచారం చేస్తున్నారు. రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో రెండు రోజుల్లో తెలియనుంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×