BigTV English

Pushpa 2: డైరెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ను టార్గెట్ చేస్తున్న ‘పుష్ప 2’.. సక్సెస్ అవ్వగలదా?

Pushpa 2: డైరెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ను టార్గెట్ చేస్తున్న ‘పుష్ప 2’.. సక్సెస్ అవ్వగలదా?

Pushpa 2 : తెలుగులో వచ్చే పాన్ ఇండియా సినిమాలు అన్నీ అప్పటివరకు విడుదలయిన ఇతర పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్స్‌తో పోటీపడాలని, వాటికంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాలనే టార్గెట్‌గా పెట్టుకుంటాయి. ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా అదే పనిచేస్తోంది. తెలుగులో పాన్ ఇండియా సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది రాజమౌళి. ఇక రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేయాలని ‘పుష్ప 2’ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి.


ఫస్ట్ డే కలెక్షన్స్…

రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 2022లో విడుదలయ్యింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలయ్యింది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో భారీ అంచనాలతో టికెట్ హైక్స్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫస్ట్ డేనే రూ.257.15 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు మొదటి రోజే రూ.120.19 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. కర్ణాటకలో రూ.16.48 కోట్లు, తమిళనాడులో రూ.12.73 కోట్లు, కేరళలో రూ.4.36 కోట్లు ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఫస్ట్ డే రికార్డులను ‘పుష్ప 2’ బీట్ చేస్తుందా అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువయ్యింది.


Also Read: ‘రాధే శ్యామ్’ను బీట్ చేసిన ‘కంగువా’.. కలెక్షన్స్ విషయంలో అలాంటి రికార్డ్

ఓవర్సీస్‌లో రికార్డ్…

ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయం పక్కన పెడితే.. ఓవర్సీస్‌లో ఈ మూవీ సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ‘ఆర్ఆర్ఆర్’ మొదటి రోజే 702,480 డాలర్ల కలెక్షన్స్ సాధించింది. న్యూజిలాండ్‌లో 69,741 డాలర్లు, యూకేలో 238,313 యూరోలు, అమెరికాలో 3,198,766 డాలర్లు, కెనడాలో 270, 361 డాలర్లు, నార్త్ అమెరికాలో 3,469,127 డాలర్లు ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత తెలుగు నుండి విడుదలయ్యే ఏ పాన్ ఇండియా సినిమా అయినా ఓవర్సీస్‌లో ఇలాంటి ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించడం అసాధ్యం అని ప్రేక్షకులంతా ఫిక్స్ అయిపోయారు. అలాంటిది ‘పుష్ప 2’ ఈ రికార్డులను బ్రేక్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

టికెట్ ధరలు పెంపు…

‘పుష్ప 2’కు మొదటిరోజే అదిరిపోయే కలెక్షన్స్ రావాలని ఒక రేంజ్‌లో టికెట్ ధరలను పెంచేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్‌లో టికెట్ ధరలు పెరగలేదు. దీంతో మొదటిరోజే ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ రావడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఈ మూవీకి మొదటిరోజు కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. పెరిగిన టికెట్ ధరలను కూడా పట్టించుకోకుండా చాలామంది మూవీ లవర్స్ దీనికోసం థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలిసి తమ పేర్లపై కూడా దిమ్మదిరిగే రికార్డులను ఉండాలని ‘పుష్ప 2’తో ప్రయోగం చేస్తున్నారు. వారి ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×