BigTV English

Capsicum Egg Fry: క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై.. దీన్ని చేసినవారికి ఆస్తులు రాసిచ్చేయడం ఖాయం

Capsicum Egg Fry: క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై.. దీన్ని చేసినవారికి ఆస్తులు రాసిచ్చేయడం ఖాయం
క్యాప్సికమ్, కోడిగుడ్డు… ఈ రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి వేపుడు చేస్తే రుచి అదిరిపోతుంది. పైగా ఈ రెండింటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పైగా క్యాప్సికం ఎగ్ ఫ్రై చేస్తున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. చలికాలంలో ఈ రెసిపీ మీకు మంచి పోషకాలను అందిస్తుంది. ఈ క్యాప్సికం ఎగ్ ఫ్రైడ్ రెసిపీ చూస్తేనే నోరూరి పోతుంది. వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే అదిరిపోతుంది. అలాగే సాంబార్ అన్నం తింటున్నప్పుడు సైడ్ డిష్ గా ఈ క్యాప్సికం ఎగ్ ఫ్రై చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.


క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యాప్సికం – అరకిలో
కోడిగుడ్లు – నాలుగు
పచ్చిమిర్చి – రెండు
ఆవాలు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి
ఉప్పు – రుచికి సరిపడా
కారం – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూను
పసుపు – పావు స్పూను
జీలకర్ర – ఒక స్పూను

క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ
⦿ క్యాప్సికంలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
⦿ తర్వాత ఉల్లిపాయ తరుగును వేసి బాగా వేయించుకోవాలి.
⦿ పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వేయించుకోవాలి.
⦿ అందులోనే పసుపు అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.
⦿ ఇప్పుడు క్యాప్సికం తరుగును వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
⦿ క్యాప్సికం ముక్కలు మెత్తబడి బాగా ఉడికే వరకు ఉంచాలి.
⦿ ఆ తర్వాత మూత తీసి ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
⦿ క్యాప్సికం వేపుడు లాగా అయ్యాక కోడిగుడ్లను కొట్టి అందులో వేయాలి.
⦿ పైన మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి.
⦿ తర్వాత మూత తీసి మొత్తం మిశ్రమాన్ని గరిటతో చిన్న చిన్న ముక్కలుగా కలుపుకోవాలి.
⦿ పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే.

క్యాప్సికం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో తినాల్సిన కూరగాయల్లో క్యాప్సికం ముఖ్యమైనది. దీనిలో అనేక రకాల రంగుల్లో ఉంటాయి. దీంట్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ క్యాప్సికం తింటే శరీరానికి కావాల్సినంత విటమిన్ సి అందుతుంది. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు కూడా పెరగరు. క్యాప్సికం కోడిగుడ్లు కాంబినేషన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, ఎముకలు బలంగా మారేలా చేస్తుంది. క్యాప్సికంలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి క్యాప్సికం రోగులు హ్యాపీగా తినవచ్చు. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ రెసిపీ ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×