Pushpa2 : పుష్ప 2 మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ ను రాబడుతూ రికార్డులు క్రియేట్ చేసింది. మూడు రోజులకే 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందని సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇక నార్త్ ఏరియాల్లో పుష్ప రాజ్ దున్నెస్తున్నాడని వార్త షికారు చేస్తుంది. గతంలో పుష్ప కు అదే క్రేజ్, ఇప్పుడు కూడా నార్త్ అభిమానులు అదే అభిమానాన్ని చూపిస్తున్నారని తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ గతంలో స్టార్ హీరోలకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసేంత క్రేజ్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. అసలు నార్త్ ఆడియన్స్ పుష్ప పై అంత అభిమానాన్ని చూపించడం బన్నీ లక్ అనే సినీ అభిమానుల టాక్.. అసలు నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ పుష్ప 2 పై అంతగా అభిమానాన్ని చూపించడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
డైరెక్ట్ హిందీ మూవీ కాకుండా కేవలం డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ తక్కువగా ఉండే రాష్ట్రాల్లోనూ ఈ ప్యాన్ ఇండియా మూవీ సృష్టిస్తున్న భీభత్సం చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒక నాన్ ప్రభాస్ అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహించని ఒక కమర్షియల్ బొమ్మ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం ఆశ్చర్య పడాల్సిన విషయమే. అంతగా ఎనలేని అభిమానాన్ని చూపించడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం..
*. పుష్పరాజ్ మ్యానరిజం . ఊర మాస్ సెటప్, ఎవడిని లెక్క చేయని మనస్తత్వం, భార్య అడిగిందని వందల కోట్లు ఖర్చు పెట్టే తెగింపు, వ్యవస్థనే సవాల్ చేసే పొగరు ఈ లక్షణాలు నార్త్ జనాలకు గూస్ బంప్స్ ఇచ్చాయి..
*. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్, ఓటిటిలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. సింగం అగైన్ లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అనుకున్నట్లు మెప్పించలేకపోయాయి..
*.చిత్తూరు సైడ్ గ్రామదేవత గంగమ్మ జాతరను అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మలచిన వైనం అరగంటకు పైగా థియేటర్లో కూర్చున్న వాళ్ళను రెప్ప వేయనివ్వలేదు.
*. సినిమాలోని పాటలు, దేవీ ఇచ్చిన అదిరిపోయే మ్యూజిక్.. సామ్ సిఎస్ తో పాటు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డాల్బీ అట్మోస్ తెరలను షేక్ చేశాయి. అయిదోది అసలు కారణమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జాతర, క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ ఈ మూడింటిని ఇదే స్థాయిలో ఇంకో హీరో చెయ్యడం కష్టమే అని చెప్పాలి. బన్నీ మ్యానరిజం, మాస్ లుక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా నార్త్ లో బన్నీ పుష్ప రాజ్ హిట్ అవ్వడానికి కారణాలు అని చెప్పాలి. ఇక అక్కడ పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తెలుగు డబ్బింగ్ సినిమాకు ఇంత క్రేజ్ రావడం మామూలు విషయం కాదు..