OTT Movie : ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు ఎక్కువగా వైలెన్స్ తో వస్తున్నాయి. స్టోరీ తక్కువ వైలెన్స్ ఎక్కువ, అటువంటి కాన్సెప్ట్ తో సినిమాలను తెరికెక్కిస్తున్నారు దర్శకులు. కొన్ని సినిమాలు మాత్రమే వైలెన్స్ లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. మంచి కంటెంట్ తో వచ్చిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
హాట్స్టార్ (Hotstar)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ది బన్శీష్ ఆఫ్ ఇన్షేరియన్‘ (The Banshees of Inisherin) . ఈ మూవీ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో పల్లెటూరులో ఉంటూ పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. హీరో తన కన్నా చాలా పెద్దవాడైన వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. ఎంతలా అంటే వీరిద్దరూ ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు కాదు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. అయితే ఉన్నట్టుండి హీరోతో ఆ వ్యక్తి మాట్లాడటం మానేస్తాడు. అతడు ఎందుకు అలా మాట్లాడటం లేదో హీరో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. హీరో ఆలోచిస్తుండగా మరుసటి రోజు ఏప్రిల్ ఫస్ట్ అని తెలుస్తుంది. నన్ను ఫూల్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడని అనుకుంటాడు. అయితే ఆ మరుసటి రోజు కూడా హీరోతో అతడు మాట్లాడడు. ఆ తర్వాత హీరో అతనిని ప్రశ్నించగా, నాకు వయసు అయిపోతుంది, నేను వయోలిన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నీతో మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప నేను ఏమి చేయలేకుండా ఉన్నాను అంటూ సమాధానం చెప్తాడు. దీనికి కోపం తెచ్చుకున్న హీరో అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అయితే హీరో ఒంటరిగా ఫీల్ అవుతూ, అతని దగ్గర ఉన్న జంతువులతో తన బాధను పంచుకుంటాడు.
తన దగ్గర ఉన్న ఒక గాడిదతో తన బాధను పంచుకుంటాడు. ఆ తరువాత హీరో మళ్లీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అయితే నాతో మళ్లీ మాట్లాడితే నా వేలును కట్ చేసుకుంటానని ఫ్రెండ్ చెప్తాడు. సరదాకి అంటున్నాడు అనుకొని మళ్లీ మాట్లాడతాడు. అయితే హీరో ఫ్రెండ్ తన వేలిన కట్ చేసుకుంటాడు. ఇది చూసిన హీరో చెల్లెలు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని జాబ్ చేసుకోవాలని ఏడుస్తూ సిటీకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ కట్ చేసిన వేలుని గాడిద తిని చచ్చిపోతుంది. హీరో గాడిద చనిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిపోతాడు. అప్పుడు హీరో తన ఫ్రెండ్ ఇంటిని తగలబెడతాడు. ఆ ఇంట్లో అప్పుడు హీరో ఫ్రెండ్ కూడా ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఇంటిని ఎందుకు తగలబెట్టాడు? ఫ్రెండ్ తన వేళ్లను ఎందుకు కట్ చేసుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి