Allu Arjun- Jani Master:సినీ సెలబ్రిటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ అవార్డు(National Award) కూడా ఒకటి. ఈ నేషనల్ అవార్డు రావాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వున్న ప్రజలను మెప్పించాల్సి ఉంటుంది. అప్పుడే జాతీయ అవార్డు లభిస్తుంది. అయితే ఈ నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడానికి సెలబ్రిటీలు పడే కష్టం వర్ణనాతీతం. ఇదిలా ఉండగా మరోవైపు నేషనల్ అవార్డును టార్గెట్ గా పెట్టుకొని నటించిన నటులు కూడా ఉన్నారు. ఒక్కసారి నేషనల్ అవార్డు లభిస్తే, క్రేజ్ తో పాటు ఆఫర్లు కూడా భారీగా వస్తాయి.. కానీ ఇద్దరు నటీనటులకు మాత్రం ఈ నేషనల్ అవార్డు కలిసి రావడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ కూడా నేషనల్ అవార్డు టార్గెట్ గా పనిచేసి,అందుకు తగ్గట్టుగానే తమ ప్రతిభతో నేషనల్ అవార్డు అందుకున్నారు. కానీ ఇద్దరూ కూడా జైలు పాలు అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
నేషనల్ అవార్డు అచ్చిరాని సెలెబ్రిటీస్..
ఆ ఇద్దరిలో ఒకరు నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ఇంకొకరు నేషనల్ అవార్డు గ్రహీత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master).
అరెస్ట్ పై సమాధానం చెప్పకుండా పారిపోయిన జానీ మాస్టర్..
ఇకపోతే తాజాగా జానీ మాస్టర్ తో ఒక మీడియా ప్రతినిధి మాట్లాడుతూ..” అల్లు అర్జున్ కు, మీకు జాతీయ అవార్డు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయ్యారు. దీనిపై మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నించగా.. జానీ మాస్టర్ సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్(Sukumar)దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పుష్ప’. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వచ్చి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ కి నార్త్ ఇండియాలో కూడా భారీ మార్కెట్ అందించింది అని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన బన్నీ పర్ఫామెన్స్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అంతేకాదు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా కూడా రికార్డు సృష్టించారు. అయితే అదే జోష్ లో అల్లు అర్జున్ మూడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి ‘పుష్ప 2’ సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12వేల కు పైగా థియేటర్లలో విడుదలై.. మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దూసుకుపోతోంది. అయితే ఈ ఆనందాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. ఎందుకంటే? హైదరాబాదులోని సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో వేయగా.. బన్నీ రాకతో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయి, మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. దీంతో నేషనల్ అవార్డు వచ్చినా అరెస్ట్ తప్పలేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్..
ఇక మరొకవైపు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ఒక టాలీవుడ్ లోనే కాదు శాండిల్ వుడ్, కోలీవుడ్ లో కూడా సత్తా చాటారు. అందులో భాగంగానే శాండిల్ వుడ్ లో ఆయన కొరియోగ్రఫీ అందించిన ఒక సినిమాకి అవార్డు లభించింది. ఇటీవల కోలీవుడ్ లో ధనుష్(Dhanush) హీరోగా నటించిన ‘తిరు’ సినిమాకి కూడా జాతీయ అవార్డు వచ్చింది. కానీ ఈ అవార్డు అందుకునే లోపే లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో ఆయనను అరెస్టు చేశారు. దాంతో రెండవసారి వచ్చిన జాతీయ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది.