Satyabhama Today Episode December 23 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. క్రిష్ చక్రవర్తికి కేక్ తినిపిస్తాడు. అలాగే సంజయ్ కూడా మహాదేవయ్యకు కేకు పెడతాడు. ఇక ఇదంతా చూసిన భైరవి ఏంటి గందరగోళం అనేసి అనుకుంటుంది. ఎవరికీ ఎవరు కొడుకు అర్థం కావట్లేదు. మరోవైపు మహదేవయ్య సత్య పుట్టిళ్లు తనది అని గొడవ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావ్రా అని అడుగుతాడు మహాదేవయ్య.. డబ్బు కావాలని ఆ వ్యక్తి చెప్తాడు. నందిని వాళ్లను చూసి గుర్తు పట్టి వాడేంటి ఇక్కడికి వచ్చి బాపుతో మాట్లాడుతున్నాడని అనుకుంటుంది. తండ్రి ఆయనకు డబ్బు ఇవ్వడం చూసేస్తుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని తెలుసుకోవాలని అనుకుంటుంది.. సత్య వదిన చెప్పింది నిజమే ఏమో తెలుసుకోవాలని అనుకుంటుంది. క్రిష్ కు బాబాయ్ గోల్డ్ చైన్ ఇస్తాడు. మహాదేవయ్య సంజయ్ కు గోల్డ్ చైన్ ఇస్తాడు. అది చూసిన సత్య మీ కొడుకుకు గోల్డ్ చైన్ ఇచ్చారా అని అడుగుతుంది. క్రిష్ ఎవరి కొడుకో నాకు నిజం తెలుసు అనగానే మహాదేవయ్యకు చెమటలు పడతాయి. ఈ నిజం ఎలా తెలుసు అని ఆలోచిస్తాడు. సత్యభామ ఫిక్స్ అయితే తెలుసుకోకుండా ఆగదు. జయమ్మ ఏంటో ఈ తిరకాసు అనేసి అంటుంది. ఈ బైరవి తిరకాసు కాదు అది 20 కాసుల బంగారం అని అంటుంది.. ఇక అందరు సంతోషంగా ఉంటారు. డ్యాన్సులు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ఇంట్లో అందరూ భోజనాలు చేసి సంతోషంగా ఉంటే క్రిష్ మాత్రం పార్టీ జరిగిన ప్లేస్ నుంచి రాడు. అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి సత్యనే కారణం అని అంటాడు. ఈ ప్లేస్ నుంచి వస్తే ఈ మెమొరీస్ అన్ని మాయమైపోతాయని రావాలనిపించట్లేదు సంపంగి అనేసి అంటాడు. మనిషికి ఏ స్థలము శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు అని సత్యం అంటుంది. నీకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా అని అడుగుతుంది. జీవితంలో వాళ్ళ మొహం నేను చూడనని క్రిష్ అంటాడు. నుంచి సత్య వెళ్ళిపోతుంది. క్రిష్ వచ్చి ఏమైంది సంపంగి అని అడుగుతాడు. నువ్వు అనుకుంటున్న వ్యక్తుల్లో నేను ఉంటే నన్ను వదిలేస్తావా అనేసి సత్య అడుగుతుంది. నా మీద అనుమానమా అని క్రిష్ అంటాడు.. ఇక సత్యకు క్రిష్ మాటిస్తాడు ఏదైనా జరిగినా కూడా నిన్ను నేను వదిలిపెట్టను అనేసి మాటిస్తాడు.. మాట ఇచ్చినంత మాత్రాన సరిపోదు క్రిష్ మాటని నిలబెట్టుకోవాలి అనే ప్లీజ్ సత్య అంటుంది. పెళ్లిలో అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతూ చేసిన ప్రమాణంతో కన్నా ఇప్పుడు చేస్తున్న ప్రమాణం ఎక్కువే నా ప్రాణం పోయేంతవరకు నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. తనకి సత్య ఎమోషనల్ అయిపోతుంది. నిన్ను బాధ పెట్టనా అనేసి అడుగుతుంది. నువ్వు ఎంత బాధ పడితే ఇలా అడుగుతావు చెప్పు అనేసి క్రిష్ కూడా ఎమోషనల్ అవుతాడు. వీళ్ళిద్దరి మాటలను మహదేవయ్య చాటుగా వెంటాడు..
ఈ హ్యాపీ మూమెంట్లో ఇప్పుడెందుకు బాధపడడం ఎందుకు నా సంతృప్తి కోసం నువ్వు ఒక కోరికను కోరుకో అనేసి క్రిష్ సత్యను అడుగుతాడు. నిజంగా అడుగుతున్నావా అయితే కోరుకుంటాను నాకు అవసరం వచ్చినప్పుడు దాన్ని అడుగుతాను కాదనకూడదు బాధపడకూడదు అనేసి అడుగుతుంది. నా సంపంగి ఏం కోరుకున్నా అది కాదనకుండా ఇస్తాను అని క్రిష్ అంటాడు. వీరిద్దరిని చూసి మహదేవయ్య కోపంగా ఉంటాడు. ఈ సత్య ది మామూలు తెలివి కాదు ఆ ఎర్రోడి ముందరికాళ్ళకు బంధం ఏస్తుంది నేను తొందరపడకపోతే నా చేతిలో వచ్చి జారిపోతాడు అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇక ఉదయం లేవగానే మహదేవయ్యా తన అనుచరులకు పిచ్చిపిచ్చి పనులు చేయకండి ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయనేసి అంటాడు. ఇక క్రిష్ వచ్చేసి ఎలక్షన్స్ కి నీ బ్యానర్స్ కట్టించాలి ఫోటోగ్రాఫ్ అని పిలవన అనేసి అడుగుతాడు. ప్రచారంకి కార్లు కావాలి కదా మాట్లాడి రానా అనేసి అడగగానే లేదురా మాట్లాడేసాను అనేసి క్రిష్ కే మహదేవయ్య షాక్ ఇస్తాడు.. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది చిన్న అని పంపించేలా వద్దు నేనే వస్తాను అనేసి అంటాడు. బాపు ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నాడని క్రిష్ షాక్ అవుతాడు.. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ బాపు అని అడుగుతాడు.
నువ్వు నాతోని తిరగడం నీ పెళ్ళానికి ఇష్టం లేదురా ఈ నిజం చెప్తాడు మహదేవయ్యా. ఎమ్మెల్యే ఎవడు నీకలైతే నిన్ను ఎమ్మెల్యే చేయడం నా లక్ష్యం నా లక్ష్యానికి నా భార్య అడ్డురాదు ఒకవేళ వచ్చినా నేను మాట వింటానని ఎలా అనుకున్నావ్ బాపు అంటాడు.. నువ్వు నాకు మాట ఇవ్వు అని మహాదేవయ్య క్రిష్ ను అడుగుతాడు. ఇక సత్యా టెన్షన్ పడుతూ ఉంటుంది సత్యను చూసి మహదేవయ్యా అక్కడికొచ్చి తెగ నవ్వేస్తాడు. దిమ్మతిరిగిపోయింది కోడలా అనేసి అడుగుతాడు. ఎమ్మెల్యే గురించి ఛాలెంజ్ చేస్తాడు. నీకు ఈ రాజకీయాల గురించి ముచ్చటే అవసరం లేదు పోయి పోపులో తాలింపు వేసుకో అనేసి ఎగతాళి చేసి వెళ్ళిపోతాడు. ఇక మైత్రి హర్ష కి ఫోన్ చేస్తుంది. నందిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భర్తకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది.. అది హర్ష వింటాడు. ముట్టుకోడు కాదు.. ఇక ఫోన్ పట్టుకోదు అనేసి వార్నింగ్ ఇస్తుంది.. అటు క్రిష్ మహదేవయను ప్రచారం మొదలు పెడదామని ధూంధాం గా బాంబులు కాలుస్తాడు. ఇంట్లో అందరూ సరదాగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..