BigTV English

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Thiruveer: టాలీవుడ్ లో  సొంత కష్టాన్ని నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారినవారు చాలామంది ఉన్నారు. అందులో తిరువీర్ ఒకడు. వైవిధ్యమైన  కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మసూద సినిమాతో తిరువీర్ జీవితమే మారిపోయిందని చెప్పాలి. ఈ సినిమా విజయం తరువాత తిరువీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.


గతేడాది పరేషాన్, కుమారి శ్రీమతి  లాంటి సినిమాల్లో నటించిన ఈ కుర్ర హీరో తాజాగా మరో కొత్త చిత్రంతో రానున్నాడు. తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.  బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి హీరో రానా దగ్గుబాటి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కామెడీ  డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ ఈవెంట్ లో ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది.


నవంబర్ 7 నుంచి ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. అవ‌కాశం ఇచ్చిన హీరో తిరువీర్‌గారికి, నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితారెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు” అని చెప్పుకొచ్చాడు. తిరువీర్ సైతం.. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో తిరువీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×