E-Paper
Advertisement

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!
Advertisement

Vettaiyan.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ (TJ Gnanavel) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ (Rajinikanth)హీరోగా నటించిన తాజా చిత్రం వేట్టయాన్ (Vettaiyan). భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నా.. ప్రమోషన్స్ సరిగ్గా చేపట్టకపోవడంతో సినిమా పై బజ్ ఏర్పడలేదు. దీనికి తోడు గత వారం రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారు రజనీకాంత్. అందుకే సినిమా ప్రమోషన్స్ లో ఆయన పాల్గొనక పోవడం వల్లే సినిమాపై బజ్ ఏర్పడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్టు గానే సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు అని సమాచారం.

వేట్టయాన్ లో నటించి తప్పు చేశాడా..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమాలో రానా (Rana) విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మళ్లీ అదే మిస్టేక్ చేశారంటూ తెలుగు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రానా విలన్ గా చేస్తున్నాడు అంటే మినిమం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పాత్ర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సినిమాకి ఉన్న మైనస్లలో ఇది ప్రధానమైనది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా రానా ఈ పాత్ర చేయకపోయి ఉండి ఉంటే చాలా బాగుండు అంటూ తెలుగు ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. వేట్టయాన్ సినిమాలో చేశాడు అనే ఒక పేరు తప్ప రానాకు ఈ సినిమా ద్వారా పెద్దగా వచ్చిందేమీ ఇక్కడ కనిపించడం లేదు.

నాడు అలాంటి వాగ్దానం చేసిన రానా..

Advertisement

నాడు విరాటపర్వం సినిమా సమయంలో పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే నటిస్తాను.. లేదంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నటించను అంటూ చెప్పాడు. అయితే ఇప్పుడు రజినీకాంత్ వేట్టయాన్ సినిమాలో రానా పాత్రకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. అయినా ఎందుకు చేశాడు.? ఏం ఆశించి చేశాడు? అనే అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్స్. మొత్తానికైతే రజినీకాంత్ సినిమాలో విలన్ గా నటించాడే తప్ప అసలు తన పాత్రకు ఏ మాత్రం ఇక్కడ గుర్తింపు లభించడం లేదు అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా రానా అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

రానా కెరియర్..

రానా విషయానికి వస్తే.. నేనే రాజు నేనే మంత్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ముఖ్యంగా బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయారు ఇందులో భల్లాలదేవ్ క్యారెక్టర్ లో జీవించేశారు రానా. ఆ తర్వాత అన్నీ కూడా సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ వచ్చిన రాణా.. ఈమధ్య కాలంలో అడపాదడపా సినిమాలలో నటించినా.. ఆ పాత్రలు కూడా పెద్దగా గుర్తింపును అందివ్వడం లేదు. ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో నటించారు ఈ సినిమాతో ఆయన కెరియర్ పూర్తిగా మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా చేసి ఆయన కెరీర్ పై నెగిటివిటీ పడేలా చేసుకున్నారు అని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై రానా ఏదైనా స్పందిస్తే బాగుండు అని సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×