BigTV English

Maharaja: హిందీలో మహారాజా.. ఆ హీరోతో వర్క్ అవుట్ అవుతుందా.. ?

Maharaja: హిందీలో మహారాజా.. ఆ హీరోతో వర్క్ అవుట్ అవుతుందా.. ?

Maharaja: హిట్ సినిమాలకు రీమేక్స్ చేయడం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో జరుగుతుంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరొక భాషలో ఆ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు స్టార్ హీరోస్. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్స్ అంతగా హిట్స్ అందుకోవడం లేదు అని చెప్పొచ్చు.


ముఖ్యంగా సౌత్ సినిమాలు.. నార్త్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్.. సౌత్ లో హిట్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాను సర్ఫిరా అనే పేరుతో రీమేక్ చేశాడు. సౌత్ లో డైరెక్ట్ చేసిన సుధా కొంగరనే హిందీలో కూడా డైరెక్ట్ చేసింది. కానీ, ఏం ప్రయోజనం అక్షయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఒక సౌత్ రీమేక్ ను చేయాలనీ చూస్తున్నాడు. అతను ఎవరో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఇక ఆ సినిమా మరేదో కాదు. ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన మహారాజా. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అమీర్ చూపు మహారాజా మీద పడిందని టాక్. ఎవరు నిర్మించకపోతే .. ఆయనే స్వయంగా నిర్మించడానికి కూడా రెడీ అయ్యాడట.


విజయ్ పాత్రలో అమీర్ ఒదిగిపోతాడని తెలుసు. ఇలాంటి పాత్రలు చేయడంలో అమీర్ దిట్ట. కానీ, ఇక్కడ వచ్చిన చిక్కు అల్లా.. హిందీలో మహారాజా వర్క్ అవుట్ అవుతుందా.. ? అమీర్ కేవలం ఈ సినిమాను హిందీలోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. మరి అమీర్ ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా.. ? లేక అక్షయ్ లా ప్లాప్ ను మూటకట్టుకుంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×