Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR), ఏఎన్నార్(ANR ), కృష్ణ (Krishna), కృష్ణంరాజు (Krishnamraju), శోభన్ బాబు (Shobhan babu) వంటి వారి తరం తర్వాత అంతే పాపులారిటీ దక్కించుకున్న వారిలో చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh) అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నలుగురు హీరోలు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకుంటున్నారు. అయితే వీరి నలుగురిలో ఎక్కువగా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అన్నట్టుగానే సినిమాలు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలే కాదు వీరి అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకున్న సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి.
అంతేకాదు వీరిద్దరూ బహిరంగ ప్రదేశాలలో మాట్లాడే మాటలను కూడా బయటకు తీస్తూ వారి అభిమానులు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిబ్రవరి 14వ తేదీన రొమాంటిక్ డ్రామాగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా విడుదల కాబోతోంది. హైదరాబాదులో ఆదివారం సాయంత్రం చాలా ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నిర్మాత సాహూ గారపాటి (Sahoo garapati) కూడా విచ్చేశారు.
ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. “నేను విశ్వక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నానని చెప్పినప్పుడు, కొంతమంది నాతో అతడు మన కాంపౌండ్ కాదు కదా.. బాలకృష్ణ కాంపౌండ్.. నువ్వు వెళ్లడం ఏంటి అంటూ నన్ను అన్నారు. అయితే బాలకృష్ణ కాంపౌండ్ ఏంటి ? అతడు సినిమా ఇండస్ట్రీ కాంపౌండ్. ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికి మనం సపోర్టుగా నిలవాలి. హీరోలు అంతా బానే ఉంటారు. వారి అభిమానులే తమ హీరో గొప్ప అని కొట్టుకు చస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఫలానా ఫంక్షన్ ఉంది లేదా ఫలానా కార్యక్రమము ఉంది అని చెబితే.. నాతో పాటు ఎవరైనా సరే కచ్చితంగా వెళ్లాల్సిందే. ఈ వయసులో, కెరీర్‌లో ఈ దశలో చిరు ప్లానింగ్ అద్భుతంగా ఉంది, యువ హీరోలకు కూడా అద్భుతంగా ఉంది. మెగాస్టార్‌ను దర్శకత్వం వహించడానికి అత్యుత్తమ దర్శకులు సిద్ధంగా ఉండటంతో ఆయన అభిమానులు ఇంతకంటే ఎక్కువ అడగలేరు లేదా ఫిర్యాదు చేయలేరు. ఎవరికి వారు బౌండరీలు కట్టుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు” అంటూ చిరంజీవి తెలిపారు. అలాగే ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది. జై జనసేన అంటూ కూడా చిరంజీవి కామెంట్లు చేశారు. దీంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని చిరంజీవి బాలకృష్ణ మధ్య తేడాలను బయటకు తీస్తూ కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి బాలకృష్ణ సినిమా ఫంక్షన్స్ కి వెళ్తే….
బయట విషయాలు పెద్దగా మాట్లాడడు. సినిమా గురించి మాట్లాడుతాడు. అంతే కానీ, సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాలు తీసుకురాడు. అలాగే పెద్దగా కాంట్రవర్సీ విషయాలను కూడా ప్రస్తావణ తీసుకురాడు.
కానీ, చిరంజీవి స్పీచ్ చూస్తే..
చాలా వరకు బాగానే మాట్లాడాడు. బాలయ్య కాంపౌండ్.. చిరు కాంపౌండ్ లేవు. మొత్తం తెలుగు ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంది అనే చెప్పాడు. కానీ, అది ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన కు ఆ విషయం ఫ్యాన్స్ చెప్పి ఉంటారు. ఓ పెద్ద హీరో నుంచి కాంపౌండ్స్ అనే వర్డ్స్ రాకుండా ఉండాల్సింది. చిరంజీవి కాంపౌండ్స్ ఏం లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అది బయటికి అలా కన్వే అవ్వలేదు.
అలాగే ప్రజారాజ్యం అనేదే జనసేన గా రూపాంతరం చెందింది అంటూ జై జనసేన అని కూడా అన్నాడు.
ఇది కూడా ఓ మైనస్. ఇది రాజకీయ సబ కాదు.. మూవీ ఈవెంట్. ఇక్కడ అలాంటి స్లోగన్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదే ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వి 150 – 11 అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరం లేపాయి. ఏకంగా లైలా మూవీని బాయ్ కాట్ చేయాలి అనే డిమాండ్ వస్తుంది. వైసీపీ వాళ్ల తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
వీటి వల్ల కూడా చిరంజీవి మాట్లాడిన మాటలకు అర్థం మారుతుంది. కాబట్టి… చిరంజీవి ఆ కాంపౌండ్, రాజకీయ స్లోగన్స్ చేయకుండా ఉండాల్సింది అని కామెంట్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాలయ్య ఎమ్మెల్యే అయినా… సినిమా ఫంక్షన్స్ లో ఎక్కడా కూడా రాజకీయాల ప్రస్తావన తీసుకురాడు అని కామెంట్ చేస్తున్నారు.