BigTV English

Vidadala Rajini: రంగంలోకి రజినీ.. అంత కోపం ఎందుకో!

Vidadala Rajini: రంగంలోకి రజినీ.. అంత కోపం ఎందుకో!

చిలకలూరిపేట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి, నాడు గురుశిష్యులు.. నేడు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకునే పరిస్థితి. మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న మాజీమంత్రి విడదల రజినీ… ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోవడానికి కారణాలేంటనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానంటూ రజినీ చేసిన వ్యాఖ్యలు… హాట్‌ టాపిక్‌గా మారాయి.


ఇదీ.. సంగతి. ఇన్నాళ్లూ మాటల విషయంలో కాస్త సైలెంట్‌గా ఉన్న విడదల రజినీ ఆగ్రహానికి కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విషయానికి వస్తే…చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి విడదల రజినిపై… SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. 2019 లో సీఐగా ఉన్న సూర్యనారాయణతో పాటు, రజిని PAలు నాగఫణీంద్ర, రామకృష్ణపై కేసు నమోదు చేశారు. ఐ-టీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేశారు. తనను స్టేషన్‌లో కొడుతూ, వీడియో కాల్ ద్వారా అప్పటి MLA అయిన విడదల రజని, ఆమె పీఏలకు చూపించారని ఆరోపణలతో.. కేసు నమోదు చేశారు.

తనపై కేసుల నమోదు కావడానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కారణమని భావిస్తున్న రజినీ.. ఓ రేంజ్‌లో చెలరేగి పోయారు. టైమ్ వచ్చినప్పడు అందరి లెక్కలూ తేలుస్తానని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను… చిలకలూరిపేట వదలి వెళ్లానని.. అంతే తప్ప.. నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు మాజీమంత్రి. 30 ఏళ్ల పాటు తాను అక్కడే ఉంటానంటూ ఘాటుగానే స్పందించారు. అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయనే విషయాన్ని పుల్లారావు గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు రజినీ. రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినా.. వారిని వదలనంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతానికి అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులు కూడా ఈ మాటలను గుర్తు పెట్టుకోవాలన్నారామె.


తన ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు ప్రత్తిపాటి.. పాతికేళ్ల రాజకీయ అనుభవం ఎందుకూ పనికిరాదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. మరోవైపు.. వైసీపీ నేతకు… ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ వేశారు. ఆమె చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరు పారిపోయారని ఆరోపించారు. దిక్కుతోచక… ఇప్పుడు మరోసారి చిలకలూరిపేటకి వచ్చి వార్నింగ్ ఇస్తే ఎవరూ భయపడరని ఆయన అన్నారు. రజిని అరాచకాలు, అవినీతిపై ఇంతవరకు ఫోకస్ చేయలేదని.. ఇప్పుడు అన్ని లెక్కలు తేలుస్తానని అన్నారాయన. ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలతో జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలూ ఒక్కసారిగా హీటెక్కాయి.

గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం కాకుండా…గుంటూరు నుంచి రజినీని పోటీలో నిలిపారు జగన్‌. అభ్యర్థుల అందరిపైనా సర్వేలు చేయించిన వైసీపీ అధినేత.. కొందరి స్థానాలను మార్చేశారు. అందులో భాగంగా మాజీమంత్రిని చిలకలూరిపేట నుంచి కాకుండా.. గుంటూరు నుంచి పోటీలో దించారు. 2019లో గెలిచాక.. ఆమె మంత్రి కూడా అయ్యారు. ఆమె హయాంలో మైనింగ్‌, ఇసుక తరలింపులో దందాలు నడిచాయనే వార్తలు వినిపించాయి. తన పీఏల సాయంతో క్రషర్ యాజమానులను బెదిరించారని…పెట్రోలు బంకులను కూడా ఆమె లాక్కున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటు నాడు తెలుగుదేశం నేతలపై కేసులు పెట్టించారని.. తద్వారా ఎంతోమంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారని… టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చాలామందిపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రజినీపైనా కేసు పెట్టడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారనే టాక్ నడుస్తోంది.

ఇందులో మరో ట్విస్టు కూడా ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యే పుల్లారావుపై ఘాటు వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలూ లేకపోలేదని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేసిన రజినీ..గతంలో ఎక్కడా ఇంత ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె జనసేనలో చేరుతారనే టాక్ కూడా నడిచింది. అయితే… వీటికి ఒకసారి సమాధానం చెప్పేందుకే ఆమె అలా రియాక్ట్ అయ్యారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనతో జాయిన్ అయ్యే అవకాశం లేకపోవటం… ఉన్న పార్టీలో తన సీటును కాపాడుకోవటానికి మాజీమంత్రి ఇంత స్కెచ్ వేశారనే వాదనలు ఉన్నాయి.

Also Read: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టులు.. కొందరి నేతలతో జగన్ మంతనాలు!

ఏది ఏమైనా… సౌమ్యంగా ఉండే నేతగా పేరు తెచ్చుకున్న రజినీ… ఒకేసారి ఇలా మాటలతో బ్లాస్ట్ అవటం మాత్రం సంచలనంగా మారింది. తనపై నమోదైన కేసు ప్రజల్లోకి వెళ్లనీయకుండా… తన మాటలు మాత్రమే వెళ్లే విధంగా స్టైల్ మార్చి..పుల్లారావుతో పాటు అధికారులనూ.. రజినీ టార్గెట్ చేశారనే వాదనలు తెరపైకి వచ్చాయి. విడదల రజనీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పుల్లారావు కూడా అదే స్థాయిలో స్పందించారు. తాను ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. రజినీ యాక్షన్‌కు…పుల్లారావు రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×