BigTV English

OTT Movie : అబ్బాయిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టే అమ్మాయి… పిచ్చెక్కించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : అబ్బాయిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టే అమ్మాయి… పిచ్చెక్కించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలాసార్లు అనవసరమైన కష్టాలను తెచ్చి పెట్టి జీవితాన్ని కష్టతరం చేస్తుంది అందులో భాగమైన సోషల్ మీడియా. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. సోషల్ మెసేజ్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

సాధారణంగా హ్యాకింగ్, సైకో కిల్లర్ వంటి అంశాలతో వచ్చే సినిమాలు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే రియల్ లైఫ్ లో జరిగిన ఇలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు కూడా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో సైకో కిల్లర్ ఏకంగా ఓ మనిషిని చంపి ఫ్రిజ్ లో దాచి పెట్టడం, వాషింగ్ మిషన్ వల్ల ఆ అమ్మాయికి సైకో పిల్లలతో వైరం ఏర్పడడం వంటి వింత సంఘటనలు అన్నీ జరుగుతాయి. ఈ సినిమా పేరు “టార్గెట్” (Target). వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ కొరియన్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే…

సెకండ్ హ్యాండ్ యాప్ లో ఒక వ్యక్తి మ్యాక్ బుక్ ను అమ్మకానికి పెడతాడు. అయితే దాని కోసం ఎంతోమంది అబ్బాయిలు మెసేజ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా కేవలం అమ్మాయిలకు మాత్రమే రిప్లై ఇస్తూ ఉంటాడు. అలా ఓ అమ్మాయి నోట్ బుక్ కొంటానని చెప్పగా ఆమెను ఇంటికి ఆహ్వానిస్తాడు. కానీ తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాడిని చంపేసి ఫ్రిడ్జ్ లో దాచిపెడుతుంది. అలాగే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే యాప్ లో తన ఇంట్లోనే వస్తువులన్నింటిని అమ్మకానికి పెడుతుంది. ఆ తర్వాత సీన్ లో హీరోయిన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కనిపిస్తుంది. తన వాషింగ్ మిషన్ కరాబ్ అవ్వడంతో ఫ్రెండ్ సలహా మేరకు ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే యాప్ లో మరో వాషింగ్ మెషిన్ ని కొంటుంది. అయితే హీరోయిన్ కి వాషింగ్ మిషన్ అమ్మేది ఒక సైకో కిల్లర్.

తను చంపేసిన వ్యక్తి ఐడెంటిటీని తన ఐడెంటిటీ గా మార్చుకుని వాషింగ్ మిషన్ తో పాటు ఇతర వస్తువులను కూడా అమ్మేస్తాడు. కానీ ఇంటికొచ్చాక ఆ వాషింగ్ మెషిన్ సరిగ్గా పని చేయట్లేదని కోపంతో యాప్ లో నెగిటివ్ రివ్యూ పెడుతుంది హీరోయిన్. దీంతో ఒక్కసారిగా హీరోయిన్ ని టార్గెట్ చేసి ఆమె ఇంటికి ఫుడ్ ఆర్డర్స్ పంపించడం, తన తల్లి లాగా మాట్లాడి డబ్బులు పంపించమని అడగడం ఆమె ఎకౌంట్ ని హ్యాక్ చేసి బాయ్ ఫ్రెండ్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేసి హీరోయిన్ జీవితాన్ని తలకిందులు చేస్తాడు. మరి ఆ తర్వాత హీరోయిన్ వాడి ఆటలు కట్టించడానికి ఏం చేసింది? చివరికి ఈ సైకో కిల్లర్ ఏమయ్యాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×