BigTV English

Manchu Manoj: భైరవం డబ్బు కోసమే చేశాను… మనోజ్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా?

Manchu Manoj: భైరవం డబ్బు కోసమే చేశాను… మనోజ్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా?

Manchu Manoj: మంచు మనోజ్(Manchu Manoj) ప్రస్తుతం భైరవం(Bhairavam) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా బిజీగా గడుపుతున్నారు. మరొక రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తూ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకువెళ్తున్నారు.. ఇక ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. విజయ్ దర్శకత్వంలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ ముగ్గురు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నారా రోహిత్ మంచు మనోజ్ ఇద్దరూ ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజతో (Tasty Teja)కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.


ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంచు మనోజ్ నారా రోహిత్ ఎన్నో ఆసక్తికరమైన, సరదా అంశాల గురించి చర్చించారు. అయితే టేస్టీ తేజ మంచు మనోజ్ ను ప్రశ్నిస్తూ… మీరు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ గ్యాప్ లో ఎన్నో కథలను వినే ఉంటారు కానీ ఎందుకు భైరవం సినిమాని చేయాలనుకున్నారు, ఈ సినిమా చేయటానికి కారణమేంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంచు మనోజ్ ఊహించని సమాధానం చెప్పారు.

డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా…


తాను 9 సంవత్సరాల తర్వాత భైరవం సినిమాలో నటించడానికి కారణం ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బేనని తెలిపారు. ఇలా మనోజ్ ఈ సమాధానం చెప్పడంతో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. మనోజ్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అలాగే ఈయనకు ఎలాంటి సినిమాలు కూడా లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? డబ్బు కోసమే సినిమాలలో నటిస్తున్నారా? అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అయితే మంచు మనోజ్ ఈ సినిమాలో నటిస్తుంది డబ్బు కోసమే అంటూ సరదాగా చెప్పారని వెల్లడించారు.

డైరెక్టర్ కారణంగానే…

ఈ సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం డైరెక్టర్ విజయ్ అని తెలిపారు. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. ఇక డైరెక్టర్ విజయ్ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇక ప్రొడ్యూసర్ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి పరిచయం. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉండటంతోనే తాను ఈ సినిమాలో నటించానని అసలు విషయం బయటపెట్టారు. దీంతో మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మా కుటుంబంలో గొడవలు అందుకే జరుగుతున్నాయి…

ఇకపోతే మనోజ్ గత కొంతకాలంగా కుటుంబ సమస్యలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి తన కుటుంబ సభ్యులతో వివాదాలు ఉన్నప్పటికీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో తరచూ తన అన్నయ్య విష్ణు తో గొడవలకు దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవలు మాత్రం డబ్బు ,ఆస్తి కోసం కాదని యూనివర్సిటీ కోసం, విద్యార్థుల కోసమే తాను గొడవ పడుతున్నానని మనోజ్ పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×