Nara Rohit: నారా రోహిత్(Nara Rohit) పరిచయం అవసరంలేని పేరు. నారా వారసుడిగా ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ, ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక నారా రోహిత్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక నారా రోహిత్ చివరిగా ప్రతినిధి 2(Prathinidhi 2) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నికలకు ముందు విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత నారా రోహిత్ భైరవం (Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మే 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
నారా రోహిత్, మంచు మనోజ్, సాయి శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైంది. ఇలాంటి తరుణంలోనే నారా రోహిత్ ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ(Tasty Teja) ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా టేస్టీ తేజ సినిమా గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి అలాగే ఫుడ్ గురించి ఎన్నో విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే నారా రోహిత్ ను టేస్టీ తేజ ప్రశ్నిస్తూ… అన్న లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటివరకు మీరు ఎంత మందితో ప్రేమలో పడ్డారు? మీ ఫస్ట్ లవ్(First Love) ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు.
నాలుగవ తరగతి లోనే…
ఈ ప్రశ్నకు నారా రోహిత్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నేను నాలుగవ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డాను అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ఆ వయసులోనే ప్రేమలో పడ్డారా? అంటూ మరో ప్రశ్న వేయగా అది ప్రేమ అని చెప్పను కానీ… ఒక అమ్మాయిపై ఇష్టం కలిగింది అంటూ నారా రోహిత్ అసలు విషయం బయటపెట్టారు. అయితే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈయన చెప్పిన ఈ సమాధానం విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా మరి సిరిలెల్లా(Siree Lella) మీ ఫస్ట్ లవ్ కాదా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
హీరోయిన్ తో రోహిత్ పెళ్లి…
నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ సిరి లెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకుండా ఏకంగా ఈయన తనతో నిశ్చితార్థం జరుపుకుంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరిద్దరిని నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాది అక్టోబర్ 13వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం తర్వాత నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి. అతి త్వరలోనే నారా రోహిత్ నటి సిరి లెల్లాతో ఏడడుగులు వేయబోతున్నారు.