BigTV English

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Nara Rohit Marriage: పెళ్లి కుదిర్చింది ఎవరో తెలుసా.? ఈమె అని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు!

Nara Rohit Marriage: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటూ కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. గత కొన్నేళ్లలో ఎంతోమంది తెలుగు హీరోలు పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో పేరు కూడా యాడ్ అవ్వనుంది. అదే నారా రోహిత్. నారా కుటుంబానికి చెందిన రోహిత్.. రాజకీయాలవైపు అడుగు వేయకుండా సినిమాల్లోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు పెళ్లి కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్‌నే చేసుకుంటున్నాడు. తాజాగా నారా రోహిత్ పెళ్లి గురించి ఒక ఆసక్తికర విషయం బయటికొచ్చింది.


మంచి జోడీ

నారా రోహిత్ సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలామంది ఇతర హీరోలలాగా కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవ్వలేదు. మాస్ సినిమాలవైపు వెళ్లలేదు. ఎక్కువగా సోషల్ మెసేజ్ ఇచ్చే చిత్రాలతోనే ఆకట్టుకున్నాడు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తి పాత్రల్లోనే ఎక్కువగా నటించాడు. అలాంటి సినిమాలే తనకు ఎక్కువగా గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. అలా నారా రోహిత్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది ‘ప్రతినిధి’. చాలాకాలం క్రితం విడుదలయిన ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ కూడా తెరకెక్కింది. అందులో నారా రోహిత్‌కు జోడీగా సిరి లేళ్ల హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సెట్‌లో ఏర్పడిన వీరి పరిచయం.. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లనుంది.


Also Read: అప్పుడు ‘హనుమాన్’, ఇప్పుడు ‘మహాకాళి’.. మాట నిలబెట్టుకున్న యంగ్ డైరెక్టర్

లవ్ మ్యారేజ్ కాదేమో

ఇక నారా రోహిత్ పెళ్లి విషయంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ప్రతినిధి 2’ చూసి నారా రోహిత్‌కు సిరి లేళ్ల సరైన జోడీ అని భావించిన భువనేశ్వరి.. ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లిని ఖాయం చేశారట. అయితే ఒక హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నారు అనగానే వాళ్లిద్దరూ ప్రేమలో పడి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారనే ప్రేక్షకులు అనుకుంటారు. కానీ రోహిత్, సిరి విషయంలో అలా జరగలేదు. నారా భువనేశ్వరి ముందు ఉండి వీరి పెళ్లిని నిశ్చయించారని సమాచారం. ఇంకా వీరి నిశ్చితార్థానికి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటికి రాకపోయినా.. అక్టోబర్ 13న హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

ఒక్కటే సినిమా

నారా రోహిత్, సిరి లేళ్ల కెరీర్ విషయానికొస్తే హీరోయిన్‌గా సిరికి ‘ప్రతినిధి 2’నే మొదటి సినిమా. ఆ ముందు గానీ, తర్వాత గానీ ఇంక తను ఏ చిత్రాల్లోనూ నటించలేదు. నారా రోహిత్ మాత్రం హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా తనకు నచ్చే స్క్రిప్ట్స్‌ను, సోషల్ మెసేజ్ కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 2018 నుండి 2024 వరకు సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్.. 2024లో జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతినిధి 2’తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ‘సుందరకాండ’ అనే పూర్తిస్థాయి ప్రేమకథతో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు నారా రోహిత్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×