BigTV English

Rupa Lakshmi : ఆస్తి కోసమే నన్ను బలి చేశారు.. అయ్యో లచ్చవ్వ జీవితంలో కష్టాలు..?

Rupa Lakshmi : ఆస్తి కోసమే నన్ను బలి చేశారు.. అయ్యో లచ్చవ్వ జీవితంలో కష్టాలు..?

Rupa Lakshmi : చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసిన బలగం మూవీ. ఈ చిత్రంలో లచ్చవ్వ పాత్రలో నటించిన రూప లక్ష్మి పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఆ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. బలగం కంటే ముందు పలు సినిమాల్లో నటించినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ఎప్పుడైతే బలగం సినిమాలో కొమురయ్య కూతురుగా కనిపించిందో అప్పటి నుంచి టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ నటిగా మారింది. ఈమధ్య సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. అంతేకాదు సమయం దొరికినప్పుడు పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఈమె ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ను చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..


రూప లక్ష్మీ సినిమాలు..

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేం. ఎంతో మంది అయిదు పదేళ్లు సినిమాలు చేసినా దక్కని గుర్తింపు కొందరికి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సక్సెస్ దక్కుతుంది. ముఖ్యంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే నోటెడ్‌ అవుతారు.. అలాంటి వారిలో రూప లక్ష్మీ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కానీ అంతగా పేరు రాలేదు. బలగం మూవీతోనే బాగా పాపులర్ అయ్యింది.. దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్‌ సాబ్‌ నటించింది. ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి 8 ఏళ్ల తర్వాత ఆమె సక్సెస్ ను అందుకోవడం విశేషం.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో పర్సనల్ లైఫ్ గురించి పంచుకుంది..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. పండగ స్పెషల్ మూవీస్ డోంట్ మిస్..

కన్నీళ్లు తెప్పిస్తున్న లచ్చవ్వ రియల్ స్టోరీ..

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కష్టాలను బయటపెట్టింది. నేను పేరెంట్స్ ప్రేమకు దూరమయ్యానని పెంచిన తండ్రే నా ప్రపంచం అని రూపాలక్ష్మి కామెంట్లు చేశారు. 15 సంవత్సరాల వయస్సులోనే నా పెళ్లి జరిగిందని రూపాలక్ష్మి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నా కన్నతల్లి చనిపోయింది. నేను జీవితం లో కొద్ది రోజులు సంతోషంగా ఉన్నాను అంటే అది కేవలం నన్ను దత్తత తీసుకున్న తండ్రి వల్లే.. ఆ కుటుంబంలో ఆస్తి కోసమే నన్ను బలి చేశారు. నాకు కష్టాలు కొత్తేమి కాదని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన వారంతా అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా ఆమెకు తెలుగు లో ఆఫర్లు పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రూపాలక్ష్మి టాలెంట్ ఉన్న నటి కాగా ఇంటర్వ్యూల లో ఆమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×