BigTV English

AP Govt Schools Software Courses: ఏపీ ప్రభుత్వ సూళ్లలో సాఫ్ట్ వేర్ కోర్సులు.. నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ

AP Govt Schools Software Courses: ఏపీ ప్రభుత్వ సూళ్లలో సాఫ్ట్ వేర్ కోర్సులు.. నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ

Amazon Future Engineer AP Govt Schools Software Courses| సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రావాలంటే మంచి కోర్సులు చేయాలి. ముఖ్యంగా కోడింగ్ పై పట్టు ఉండాలి. సాధారణంగా ఇలాంటి కోర్సులు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు మాత్రమే అభ్యసిస్తూ ఉంటారు. అందుకే ఐటీ ఉద్యోగాలు వారే ఎక్కువగా పొందుతారు. కానీ, ఇలాంటి నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే అందించేందుకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ముందడుగు వేసింది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఆర్థికంగా బలహీనులైన విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పించి, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి కృషి చేస్తున్నారు.


అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (AFE) అనే పేరుతో ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠాలను బోధిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం గత సంవత్సరం సమగ్రశిక్ష, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు.

Also Read: చంద్రబాబు టీ పార్టీ.. ఈ ఐడియా బాగుందే..!


ఇప్పటివరకు 248 మందికి పైగా ఉపాధ్యాయులు, 7,381 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రూపాల్లో బోధించారు. తొలి సంవత్సర శిక్షణ పూర్తి చేసిన వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి, వారి నైపుణ్యాలను అంచనా వేయడానికి విశాఖలో హ్యాకథాన్ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాల పిల్లలకు స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. విజయవంతమైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లు, టీవీలు బహుమతులుగా అందించి వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు.

స్వచ్ఛందంగా పాల్గొన్న ఉపాధ్యాయులకు శిక్షణ

కంప్యూటర్, కోడింగ్ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలనుకున్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఆరు నెలలపాటు ఫిర్కీ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో శిక్షణ పొందారు. వీరు నేర్చుకున్న నైపుణ్యాలను తరగతి గదిలో విద్యార్థులకు కూడా పరిచయం చేశారు.

“కోడింగ్ అనేది సాంకేతిక భాష, ఇది మిగతా పాఠ్యాంశాలతో సంబంధం లేదు అని అనుకున్నాం. కానీ ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత తెలుగు నుండి సామాజిక శాస్త్రం వరకు కోడింగ్ ద్వారా సులభంగా పిల్లలకు బోధించవచ్చని అర్థమైంది” అని విశాఖ మాధవధార మున్సిపల్ హైస్కూల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు జానకీరామ్ తెలిపారు.

విద్యార్థుల్లో క్రియేటివిటీ గుర్తించడానికి ఓ మార్గంగా..
అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న చైతన్య.. స్క్రాచ్ అనే కోడింగ్ ప్లాట్‌ఫాం ఉపయోగించి ఆరోగ్య, అనారోగ్య సమస్యల కారణాలను విశ్లేషిస్తూ ఒక ఆన్‌లైన్ గేమ్ రూపొందించాడు. అదేవిధంగా విశాఖ లోని తోటగరువు జడ్పీ పాఠశాల విద్యార్థినులు.. కోడింగ్ సాయంతో ఈవ్‌టీజింగ్ సమస్యను యానిమేషన్ రూపంలో రూపొందించారు.

“పాఠాలతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. నిజ జీవితంలో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి వారు ముందుకు సాగుతారు” అని విజయనగరం జిల్లా కొత్తవలస పాఠశాల జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు బాపునాయుడు తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే మూడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌లో 5,000 మంది ఉపాధ్యాయులు మరియు 50,000 మంది విద్యార్థులకు AI, కోడింగ్ నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యాన్ని అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ రాష్ట్ర సమన్వయకర్త మాధవీలత తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు టెక్నాలజీ ప్రపంచానికి మరింత చేరువవుతారని, భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను పొందుతారని ఆశిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×