BigTV English
Advertisement

March 14 Movies: థియేటర్, ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

March 14 Movies: థియేటర్, ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Movies: ఈవారం కూడా ప్రేక్షులను అలరించేందుకు పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లలో ఈవారం కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ సినిమా.. ఉపేంద్ర, సుదీప్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కబ్జ’ ఈ వారం ప్రేక్షకులను థియేటర్లలో అలరించేందుకు రెడీ అవుతున్నాయి.


ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’. ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.


కబ్జ

ఉపేంద్ర, సుదీప్, శిరజ్ కుమార్ కాంబినేషన్‌లో ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కబ్జ’. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 17 తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

రైటర్ పద్మభూషన్

షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో యంగ్ హీర్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషన్’. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సార్

స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘సార్’. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇక ఈనెల 17 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మార్చి 17-ఆహా
లాక్డ్‌- సీజన్‌ 2 (వెబ్‌సిరీస్‌) మార్చి 17-ఆహా
బ్లాక్‌ ఆడమ్‌ (ఇంగ్లీష్‌) మార్చి 15-అమెజాన్‌ ప్రైమ్‌వీడియో
డోమ్‌- సీజన్ 2 (వెబ్‌సిరీస్‌) మార్చి 17-అమెజాన్‌ ప్రైమ్‌వీడియో
పాప్‌ కౌన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17-డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
రాకెట్‌ బాయ్స్‌- సిరీస్‌ 2 (హిందీ) మార్చి 16-సోనీ లివ్‌
లాక్‌ (తమిళ్‌) మార్చి 17-జీ5

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×