Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.. ఈరోజు ఆఫర్స్ బాగా వస్తున్నాయి అనుకొనేలోపు ఒక్క సినిమా ప్లాప్ అయితే ఇక ఆ తర్వాత ఒక్కో అవకాశం దూరం అవుతుంది. సినిమా ఇండస్ట్రీకే దూరం అవుతారు. హీరోల కన్నా హీరోయిన్లకు ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. చాలా మంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకు దూరం అవుతారు. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం.. ఒకప్పుడు సినిమాల తో బిజీగా ఉన్న ఈ అమ్మడు సడెన్ గా ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఇద్దరు డైరెక్టర్స్ అని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అసలేం జరిగిందో తెలుసుకుందాం..
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు పార్వతి మెల్టన్.. 2005 వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఆమెకు మంచి పేరును కూడా తీసుకొని రాలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా ఆమె కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు దూకుడు మూవీలో ఐటమ్ సాంగ్ లో అదరగొట్టింది. అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ..
తెలుగులోనే కాదు పలు భాషల్లో సినిమాలు చేసింది. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హల్లో చిత్రం లో నటించి అలరించింది. ఈ సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చివరగా యామహో యమ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ అంత హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో పాపకు అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మెల్టన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సినిమా కెరీర్ నాశనం కావడానికి ఇద్దరు డైరెక్టర్స్ కారణమని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం ఆమె బయటకు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. 2013 లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్నట్టు తెలియజేసింది. ప్రస్తుతం భర్తతో కలిసి ఈ బ్యూటీ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. మరి సినిమా అవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఆమె కళ్లకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెను మళ్ళీ సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య హీరోయిన్లు అందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. మరి ఈమె కూడా స్టార్ట్ చేస్తుందేమో చూడాలి..