E-Paper
Advertisement

Balagam Movie : ఆ గ్రామం కన్నీరు పెట్టింది.. బలగం మూవీ చూసి భావోద్వేగం..

Balagam Movie : ఆ గ్రామం కన్నీరు పెట్టింది.. బలగం మూవీ చూసి భావోద్వేగం..
Advertisement

Balagam Movie: ఇటీవల విడుదలైన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తోంది. సున్నిత అంశాలతో తెరకెక్కిన ఈ మూవీకి రోజురోజకు ఆదరణ పెరుగుతోంది. థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైనా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ తెరకెక్కిన బలగం చిన్న సినిమాగా విడుదలైన భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాత రోజులను గుర్తు చేస్తూ.. తెలంగాణలోని అనేక పల్లెల్లో ఈ సినిమాను వీధుల్లో తెరపై ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ ఊరిలో ఈ చిత్రాన్ని ఇలాగే ప్రదర్శించారు. బలగం సినిమాను చూస్తూ.. ఆ గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. క్లైమాక్స్‌ సన్నివేశాల సమయంలో ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్ పై బలగం హీరో ప్రియదర్శి స్పందించాడు. ఇది తన సినిమానేనా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Advertisement

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు బలగం చిత్రానికి దర్శకుడు. ప్రియదర్శి – కావ్యా కల్యాణ్‌రామ్‌ జోడిగా నటించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హన్షిత్‌, హర్షిత ఈ మూవీని నిర్మించారు. విడుదలైన కొన్నిరోజుల్లోనే రెండు అంతర్జాతీయ అవార్డులను బలగం సొంతం చేసుకుంది. విమర్శకులు బలగంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×