BigTV English

Radhika Merchant : అంబానీ చిన్న కోడలు హ్యాండ్ బ్యాగ్ ఫోటో వైరల్ .. ధర ఎంతో తెలుసా..?

Radhika Merchant : అంబానీ చిన్న కోడలు హ్యాండ్ బ్యాగ్ ఫోటో వైరల్ .. ధర ఎంతో తెలుసా..?

Radhika Merchant : సెలబ్రిటీలు, బడా పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో వ్యక్తులు వాడే వస్తువులపై తరచూ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. కార్లు, బైకులు, ఫోన్లు, డ్రెస్సులు, వాచీలు, బ్యాగులు ఇలా వారు వాడే వస్తువుల ప్రత్యేకతలు, ధరలపై వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటి ఖరీదు తెలుసుకుని సామాన్యులు షాక్ అవుతూ ఉంటారు. తాజాగా ముఖేష్ అంబానీ కాబోయే చిన్న కోడలపైనా ఇలాంటి చర్చే జరుగుతోంది.


తాజాగా నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధికా మర్చంట్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవలే ఈ జంటకు ఎంగేజ్ మెంట్ జరిగింది. కొత్త జంట బ్లాక్ దుస్తుల్లో మెరిశారు. ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ లేస్‌ శారీ ధరించిన రాధిక అనంత్‌ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బ్యాగ్ రేట్ పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. bollywoodshaadis.com అనే వెబ్‌సైట్‌ ఆ బ్యాగు ధర రూ.52 లక్షల 30 వేలు అని వెల్లడించింది. సిల్వర్‌ రంగులో ఉన్న ఈ హెర్మిస్‌ కెల్లీ మోర్ఫోస్‌ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తోపాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన లాంగ్ షోల్డర్ చైన్ ఉన్నాయి. ఈ బ్యాగ్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


హెర్మిస్‌ కంపెనీ తమ డిజైనర్‌ బ్యాగ్‌లను కెల్లీగా నామకరణం చేసింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటి గ్రేస్‌ కెల్లీ ఈ బ్యాగును ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లేదట. ఆమె గర్భం దాల్చినప్పుడు.. పొట్ట కనిపించకుండా అడ్డుగా పెట్టుకునేదట. దీంతో ఈ బ్యాగ్‌లు చాలా పాపులర్‌ అయ్యాయి. అప్పటి నుంచి హెర్మిస్‌ కంపెనీ ఈ బ్యాగులకు హెర్మిస్‌ కెల్లీ అని పేరు మార్చింది. తర్వాత హెర్మిస్‌ కెల్లీ మోర్ఫోస్‌ పేరిట ఆభరణాలను విడుదల చేసింది. నిజానికి ఈ బ్యాగ్ ఆభరణాల సెట్‌. దీంట్లో ఒక్కో భాగాన్ని ఒక్కో ఆభరణంతో రూపొందించారు. ఈ బ్యాగ్‌కు ఉండే చిన్న చైన్‌లను చెవి పోగుల్లా వాడుకోవచ్చు. బెల్ట్‌ను మెడ చుట్టూ ధరించే చోకర్‌లా వినియోగించుకోవచ్చు.

ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ కుమార్తె రాధికకు.. ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్‌ అంబానీతో వివాహం త్వరలో జరగనుంది. ఆమె ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. జనవరిలో రాధిక, అనంత్‌ల నిశ్చితార్థం జరిగింది.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×