Surya Transit 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు కాలానుగుణంగా తన రాశిని మార్చుకోవడమే కాకుండా నక్షత్రాన్ని కూడా మారుస్తుంటాడు. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. కానీ ఏప్రిల్ 14న అశ్విని నక్షత్రంలోకి సంచరిస్తాడు. అశ్విని నక్షత్రం కొత్త ప్రారంభాలు, చురుకుదనం, ఆరోగ్యం, శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ మార్పు చాలా ముఖ్యమైందని చెబుతారు.
ఏప్రిల్ 14 న అశ్విని నక్షత్రంలోకి సూర్యుడు సంచరించనున్నాడు. అశ్విని నక్షత్రం కొత్త ప్రారంభాలు, చురుకుదనం, ఆరోగ్యం, శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అశ్విని నక్షత్రంలో సూర్యుడి సంచారం.. 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
అశ్విని నక్షత్రంలో సూర్యుడి సంచారం మిథున రాశి శుభ సంకేతాలను ఇస్తుంది. కొత్త అవకాశాలను కల్పిస్తుంది. అంతే కాకుండా సూర్యుడి సంచారం కారణంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపార పరంగా లాభాలు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. మార్కెటింగ్, మీడియా, విద్య, విదేశీ వ్యవహారాల రంగంలో పని చేసేవారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అంతే కాకుండా ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. మునుపటి కంటే.. మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మీ తండ్రి మార్గదర్శకత్వంలో మీకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
సింహ రాశి:
సూర్యుడి సంచారం వల్ల సింహ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ కలహాలు, పాత విభేదాలు కూడా ఈ సమయంలో ముగింపు దశకు చేరుకుంటాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది . సామాజిక గౌరవం కూడా మీకు లభిస్తుంది. ఆఫీసుల్లో మీరు చేసే పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. అంతే కాకుండా మీ మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది.
Also Read: సూర్యుడి నక్షత్ర సంచారం.. ఏప్రిల్ 14 నుండి వీరికి డబ్బే డబ్బు
వృశ్చిక రాశి:
ఈ సంచారం మీ రాశి ఆరవ ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా మీరు అద్భుత ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. అంతే కాకుండా మీ ఆఫీసుల్లో కూడా ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత పదవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని బాధపెడితే మాత్రం దాని నుండి మీరు ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా పెట్టుబడుల నుండి మీకు లాభాలు లభిస్తాయి.