Trisha Krishnan:త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. తెలుగులో వర్షం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. అటు తెలుగు, ఇటు తమిళ్ భాషా చిత్రాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న త్రిష.. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గిపోయేసరికి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది.. అయితే ఇప్పుడు మళ్లీ కం బ్యాక్ ఇచ్చి అదే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
నాలుగు పదుల వయసు దాటినా.. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా.. ఇంకా అదే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది త్రిష. అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన త్రిష, ఈసారి మణిరత్నం (Maniratnam) ‘థగ్ లైఫ్’ సినిమాతో మరో స్థాయిని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అంతేకాదు త్రిష ఆ పాత్ర ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే.. తనను చూపించిన తీరుకి మణిరత్నంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చిరంజీవి (Chiranjeevi ) ‘విశ్వంభర’ పైన పడే అవకాశం కూడా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
థగ్ లైఫ్ సినిమాలో త్రిష పాత్ర పై ఆడియన్స్ అసహనం..
థగ్ లైఫ్ సినిమా విడుదలైన తర్వాత.. అందులో త్రిష పాత్రను చూశాక అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విడుదలకు ముందు ట్రైలర్ చూశాక ఈమె కమలహాసన్(Kamal Haasan)తో సరసాలాడడం గురించి, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, మీమ్స్ కూడా వచ్చాయి. ఇదే విషయంపై ప్రమోషనల్ ఇంటర్వ్యూలో త్రిషని అడిగితే.. తెర మీద చూడండి థ్రిల్ అవుతారు అని చెప్పింది. తీరా చూస్తే ఇటు కమల్, అటు శింబు ఇద్దరితో అలాంటి పెట్టిన దర్శకుడు మణిరత్నం అసలేం చెప్పాలనుకున్నాడో ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు.
పైగా త్రిష క్యారెక్టర్ కి ఇచ్చిన ఎండింగ్ చూశాక నోట మాట కూడా రాలేదు. సెకండ్ సెటప్, వేశ్యగా స్టార్ హీరోయిన్లను చూపించడం కొత్తకాదు. ఆ మాటకొస్తే వేదంలో అనుష్క కూడా ఇలాగే చేసింది. కానీ తన పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించింది. అటు పవిత్ర మూవీలో శ్రియా శరణ్ కూడా వేశ్య గానే చేసింది. ఆమె పాత్రకి కూడా భారీ క్రేజ్ లభించింది. కానీ థగ్ లైఫ్ సినిమాలో త్రిష పాత్రకు అంతస్కోప్ దొరకలేదు.
థగ్ లైఫ్ ఎఫెక్ట్.. విశ్వంభర పై పడనుందా?
ఇక జైలు నుంచి బయటకు వచ్చిన కమలహాసన్ మూడు రోజులపాటు త్రిష ఇంట్లోనే గడుపుతాడు. వాళ్ళ బంధం గురించి బయట వృద్ధురాలు అయిన వడవుక్కరసి చెప్పే విధానం వింటే చాలా అన్యాయంగా ఉంటాయి ఆ మాటలు.. అసలు ఈ పాత్ర లేకపోయినా ఆ కథకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే లాగే త్రిషను చూపించారు. ఇక ఇది తమిళ్ వరకు ఓకే కానీ ఇప్పుడు తెలుగులో త్రిష విశ్వంభర సినిమాలో చేస్తోంది. అందులోను చిరంజీవి హీరోగా ఫాంటసీ మూవీ కాబట్టి కచ్చితంగా తగినంత ప్రాధాన్యత ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రిషను ఇలా చూపించడం ఇప్పుడు మెగా మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పాటు మోహన్ లాల్ తో కలిసి నటించిన రామ్ సినిమా కూడా లైన్లో ఉంది. పొన్నియిన్ సెల్వమ్ సినిమాలో త్రిషను ఎంత అందంగా అయితే చూపించాడో ఇప్పుడు ఈ థగ్ లైఫ్ లో అంతే చెత్తగా చూపించాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. త్రిష క్యారెక్టర్ ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ ఎఫెక్ట్ విశ్వంభరపై ఏదైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.