BigTV English

Tillu Cube: బ్రేకింగ్.. టిల్లు 3 అనౌన్స్ మెంట్ వచ్చేసింది..?

Tillu Cube: బ్రేకింగ్.. టిల్లు 3 అనౌన్స్ మెంట్ వచ్చేసింది..?

Tillu Cube: ఈ మధ్యకాలంలో సినిమా మొదటి షోకే రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇంకోపక్క మేకర్స్ కూడా హిట్ టాక్ వచ్చిన నెక్స్ట్  సెకెన్ లోనే సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసేస్తున్నారు. నేడు రిలీజ్ అయ్యి  మంచి పాజిటివ్ టాక్ అందుకున్న టిల్లు స్క్వేర్ కూడా సక్సెస్ మీట్ ను పెట్టి అభిమానులకు థాంక్స్ చెప్పారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే టిల్లుకు తీసిపోకుండా సీక్వెల్ ను తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్.. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి అభిమానులకు థాంక్స్ చెప్పారు.


ఇక ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత సూర్యదేవర  నాగవంశీ టిల్లు క్యూబ్ ను కూడా ప్రకటించాడు. టిల్లు.. మళ్లీ, మళ్లీ వస్తాడు అని, త్వరలోనే టిల్లు 3 మొదలవుతుందని అనౌన్స్ చేశాడు. సోమవారం అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు తెలిపాడు.  ఇప్పటికే మూడో భాగంపై ఒక ఐడియా వచ్చిందని.. చివర్లో సిద్దు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో టిల్లు 3 ను అనౌన్స్ చేస్తామని తెలిపాడు. అంతేకాకుండా సినిమా విజయం సాధించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు.

సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు రావాలి .. టిల్లు మళ్లీ మళ్లీ రావాలి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.


Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×