Big Stories

Raghurama krishna raju: ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో.. ఎంపీ రఘురామ కృష్ణరాజు?

Raghurama krishna rajuRaghurama krishna raju: మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించాయి. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ లను వెల్లడిచింది. అయితే కూటమి నేతల మరో సారి చర్చమైదలైంది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కూటమి తమ అభ్యర్థిగా పోటీలో దించనున్నట్లు టాక్. ప్రస్తుతం టీడీపీ-జనసేన-బీజేపీ అధిష్ఠానం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రఘురామ కృష్ణరాజు విషయంలో కూటమి ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కూటమి ఇప్పిటికే రాష్ట్రంలోని అన్ని ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో రఘురామ కృష్ణరాజు ఎంపీగా పోటీ చేస్తారా..? లేదా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారా..? అనే దానిపై సందగ్ధత నెలకొంది. ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు సీటుపై చర్చలు జరుగుతున్నందున దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: TDP Final list released: ఫైనల్ లిస్ట్.. పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రులు

అయితే శుక్రవారం రఘురామ కృష్ణరాజు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తాను తప్పుకుండా పోటీ చేసి తీరుతానని.. దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అయితే రఘురామ కృష్ణరాజు గురువారం సీఎం జగన్ కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో జగన్ పై ఒంటరి పోరాటం చేస్తున్న రఘురామ కృష్ణరాజుకు కూటమి తరఫున నరసాపురం టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News