BigTV English

Yashasvi Jaiswal: గవాస్కర్ రికార్డ్ కి 62 పరుగుల దూరంలో యశస్వి

Yashasvi Jaiswal: గవాస్కర్ రికార్డ్ కి 62 పరుగుల దూరంలో యశస్వి

 


Yashasvi is 62 runs away from Gavaskar's record

Yashasvi Is 62 Runs Away From Gavaskar’s Record(Sports news today): యశస్వి జైశ్వాల్ యువ కెరటం…టీమ్ ఇండియాకు ఒక ఆణిముత్యం దొరికింది. తను కూడా ఒక సచిన్, విరాట్, రోహిత్ శర్మలా జాతీయ క్రికెట్ లో ఎదుగుతాడని అందరూ అనుకుంటున్నారు. అలాంటి యశస్వి ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఇప్పటివరకు 712 పరుగులు చేశాడు. తనకంటే ముందు సునీల్ గవాస్కర్ 774 పరుగులతో ఉన్నాడు. ఇప్పుడు సరిగా యశస్వి 62 పరుగుల దూరంలో ఆగాడు. బహుశా మరి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తాడా? లేదా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలో  జైస్వాల్ మరొక ఫీట్ సాధించాడు. అదేమిటంటే మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు.  కోహ్లీ 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 692 పరుగులు చేశాడు. ఇప్పుడీ జాబితాలో కోహ్లీని జైస్వాల్ వెనక్కి నెట్టాడు. ఈ సిరీస్ లో జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Read more: పిచ్ పై పట్టు దొరికితే వదలడు.. కులదీప్ 50 వికెట్ల రికార్డ్

నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చక్కగా ఆడాడు. ఆఫ్ సెంచరీ చేశాడు. బాగానే కుదురుకున్నాడని అనుకున్నారు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఫటాఫట్ కొడుతూ సిక్సర్ కొట్టేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చాడు. అంతే స్టంపౌట్ అయిపోయాడు. అప్పటికి 57 పరుగులు చేసి మంచి జోరుమీదున్నాడు. అవి కూడా 58 బంతుల్లోనే చేశాడు. అందులోనూ 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

తను అవుట్ అయ్యాక రోహిత్ శర్మ, ఎందుకంత ఆత్రం, ఇది టెస్ట్ మ్యాచ్ అన్న రీతిలో చూశాడు. ఏదైతేనేం మరో అద్భుతమైన రికార్డుకి చేరువ అవుతున్నాడు. మరో ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడు. మరి ఆ అవకాశం వస్తుందా? అంటే అనుమానమేనని కొందరు వ్యాక్యానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు.

మరి రెండోరోజు వీరు విజ్రంభించి సెంచరీల మోత మోగించి ఒక 500 పరుగులు దాటి చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని త్వరగా అవుట్ చేసేస్తే, యశస్వి అవకాశం కోల్పోయినట్టేనని లెక్కలు వేస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×