Anjali : రీసెంట్ గా రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)తో ప్రేక్షకులను పలకరించిన తెలుగు హీరోయిన్ అంజలి (Anjali). ఆమె సోదరి ప్రముఖ టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే…
మొదటి సినిమాకే డబ్బింగ్
సినిమా ఇండస్ట్రీలో ఉండే అచ్చ తెలుగు అమ్మాయిలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అలా లెక్కించగలిగిన అమ్మాయిల్లో అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, అందం ఉన్న హీరోయిన్ అంజలి. ముందుగా తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అంజలి ‘గేమ్ ఛేంజర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మూవీ డిజాస్టర్ అయ్యి, అంజలి ఆశలను ఆవిరి చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి తన సిస్టర్ తో పాటు కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఇంటర్లోనే డిస్కంటిన్యూ చేసి, రాజోలు నుంచి మోడలింగ్ కోసం చెన్నై వెళ్లాను. అమ్మా నాన్న ఇద్దరూ అబ్రాడ్ లోనే వర్క్ చేసేవారు. కొన్ని సంవత్సరాల క్రితమే నాన్న చనిపోయారు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోయిన్ల డేట్స్ అన్నీ ఫాదర్సే చూసుకుంటారు. అయితే చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ గారింట్లో పెరిగాను. అమ్మ నాన్న కేవలం లీవ్స్ లో వచ్చి, చూసి వెళ్లేవారు. కాబట్టి నాకు నేనే అన్ని చూసుకోవడం అలవాటైపోయింది. అయితే మేనేజర్ కూడా ఉన్నారు.
ఇక మోడలింగ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఫస్ట్ తమిళ మూవీకి నన్నే డబ్ చేసుకోమని అడిగారు. కానీ అప్పుడు తమిళ్ అంతగా రాదు. ఆ మూవీకి డబ్బింగ్ చెప్పిన తర్వాతే నా సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టాను” అంటూ తన ఎర్లీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అంజలి వెల్లడించారు.
అంజలి సోదరి యాంకరమ్మనా?
ఇక ఈ ఇంటర్వ్యూలోనే “ఇంత బాగా డబ్బింగ్ చెప్పుకోగలిగి, పర్ఫామెన్స్ ఇవ్వగలిగినప్పుడు కూడా మీలాంటి వాళ్ళను ఎందుకు తెలుగులో ఉపయోగించుకోలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు. దానికి అంజలి స్పందిస్తూ “నాకు సమాధానం తెలియదు. అదృష్టం కొద్ది నేను తెలుగులోను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి లాంటి చాలా మంచి సినిమాలను చేయగలిగాను. అలాంటి స్టేట్మెంట్ ను నేను నా సైడ్ నుంచి ఇవ్వలేను. కానీ సిచువేషన్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నారు. అయితే నేను తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు నా పెద్ద మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ” అంటూ సమాధానం చెప్పింది అంజలి.
ఇక తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురు గ్రామంలో జన్మించిన అంజలికి ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. అంజలి సిస్టర్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో యాంకర్ గా వర్క్ చేస్తోందని ఈ సందర్భంగా అంజలి వెల్లడించింది. ఆమె పేరు యామిని అని, దాదాపు 5 ఏళ్ల నుంచి ఆమె యాంకర్ గా చేస్తోందని చెప్పి సర్ప్రైజ్ చేసింది.