Local Boy Nani :గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. ఎంతోమంది అమాయకపు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్న పలు యూట్యూబ్ ఛానల్స్ పై వీసీ.సజ్జనార్ (VC.Sajjanar)మండిపడిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు లోకల్ బాయ్ నాని (Local boy Nani) పై మండిపడిన ఆయన.. ఇలాంటివి వెంటనే ఆపాలని సూచించారు. అయినా సరే వినకపోవడంతో ప్రస్తుతం లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అరెస్టుపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ (Anvesh) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. అంత కక్కుర్తి ఎందుకు అంటూ లోకల్ బాయ్ నానిపై ఫైర్ అయ్యారు.
లోకల్ బాయ్ నాని పై మండిపడ్డ ప్రపంచ యాత్రికుడు..
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ..”లోకల్ బాయ్ నాని నాకు మంచి స్నేహితుడు. గత కొన్ని సంవత్సరాలు క్రితమే పరిచయమయ్యాడు. యూట్యూబ్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటాము. పైగా వైజాగ్ వాసి కావడం, గంగ పుత్రుడు కావడంతో మేమిద్దరం మరింత దగ్గర అయ్యాము. అయితే నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని తెలిసి వెంటనే ఆపేయమని, ప్రజల వీక్నెస్ తో ఆడుకోవద్దని సూచించాను. అయినా సరే వినలేదు. ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ లో మంటలు చెలరేగినప్పుడు కూడా నాని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన విషయమంతా నాతో చెప్పాడు. ఇప్పటికైనా మానేయమని చెప్పాను. మానేస్తానని చెప్పాడు. కానీ ఆ తర్వాత మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. గంగపుత్రుడు కదా.. మంచి వాటి వైపే ఉండు అని చెప్పాను. నా మాట వినలేదు. దీంతో నాతో మాట్లాడడం మానేశాడు. బెట్టింగ్ వద్దు అని చెప్పినందుకే అతడు నాతో మాట్లాడటం మానేశాడు జైలులో ఉన్నాడు.
ప్రజలను మోసం చేసావు కాబట్టే.. జైలుకెల్లావ్ అంటూ ఫైర్..
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ సజ్జనార్ లాంటి గొప్ప వ్యక్తులకే సోషల్ మీడియాలో కేవలం 30 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నువ్వు కేవలం రెండవ తరగతి మాత్రమే చదివావు. అయినా సరే నీకు లక్షల్లో ఫాలోవర్స్. లగ్జరీ లైఫ్ ఇదంతా ప్రజలే ఇచ్చారు. అలాంటి వారికి నువ్వు ద్రోహం చేయకు. ముఖ్యంగా పెద్ద పెద్ద లగ్జరీ ఆటోమేటిక్ కారు నీ దగ్గర ఉంది. బయటకు వెళ్లాలంటే రెస్టారెంట్లకే వెళ్తావు.
కేవలం రెండవ తరగతి చదివిన నీకే ఇంత లగ్జరీ అంటే అది నమ్మబుద్ధి కాదు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేసి ఆ డబ్బు పొందావు ఇది మంచిది కాదు. ముఖ్యంగా నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగి వున్నారు.నేను ప్రపంచం నలుమూలల తిరిగి ఎన్నో విషయాలను అందరికీ తెలియజేస్తాను నేను ఒక ప్రమోట్ చేస్తే చాలు నీ దగ్గర ఉన్నలాంటి కార్లు 100 నేను కొనుగోలు చేయవచ్చు. కానీ ఇప్పటికీ మా నాన్న కొనిచ్చిన టీవీఎస్ లోనే నేను ప్రయాణం చేస్తున్నాను. మా అమ్మ, నాన్న బయటకు వెళ్లాలంటే ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. డబ్బులు కావాలంటే ఒక లాప్టాప్ అలా ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింకు క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా.. చదువుకున్న వాళ్ళు దీనిని ఫేక్ అని గుర్తిస్తారు.. కానీ చదువుకోని వాళ్ళు ఎంతోమంది నీ మాటలకు మోసపోవాల్సిందే కదా” అంటూ లోకల్ బాయ్ నాని చేసిన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోని కూడా అందులో చూపిస్తూ లోకల్ బాయ్ నాని పై మండిపడ్డారు అన్వేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.