Subbalakshmi Bhatia: సీనియర్ హీరోయిన్ గౌతమి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీనగర్ రెండవ వీధి అనే సినిమాతో గౌతమి తెలుగుకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత ఆమె స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇక గౌతమి 1998 లో సందీప్ భాటియాను వివాహమాడింది. వీరికి పుట్టిన కూతురే సుబ్బలక్ష్మీ భాటియా. ఇక కొన్ని విభేదాల వలన ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం గౌతమి.. కొన్నేళ్లు కమల్ హాసన్ తో సహజీవనం చేసింది. వీరి మధ్య కూడా విబేధాల రావడంతో ప్రస్తుతం ఆమె .. కూతురుతో కలిసి ఉంటుంది.
ఇక క్యాన్సర్ తో పోరాడి గెలిచిన గౌతమి.. ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాల్లో నటిస్తుంది. ఇక గౌతమి కూతురు సుబ్బు గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే సుబ్బు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది.
ఇక సుబ్బు అందం గురించి చెప్పాలంటే .. తల్లికి మించిన అందం ఆమె సొంతం. హీరోయిన్స్ సైతం ఆమె అందానికి ఫిదా అవుతారు అంటే అతిశయోక్తి కాదు. ఉన్నత చదువులను పూర్తిచేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం కొన్ని కథలను వింటున్నట్లు సమాచారం.
తాజగా సుబ్బు ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ టాప్ లో అమ్మడు అదిరిపోయింది. అచ్చుగుద్దినట్లు గౌతమిలానే కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ చిన్నది ఇండస్ట్రీలో ఏ హీరో సినిమాతో అడుగుపెడుతుందో చూడాలి.