BigTV English
Advertisement

Tollywood actress: తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్..!

Tollywood actress: తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్..!

Tollywood actress: ఈమధ్య కాలంలో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని.. సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకొని,అప్పుడే తల్లిదండ్రుల అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు బేబీ బంప్ తో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుండగా.. ఇప్పుడు మరొక సెలబ్రిటీ కూడా తల్లి కాబోతున్నాను అంటూ ప్రకటించి, అభిమానులను సంతోషపరిచింది. దీంతో తల్లిగా ప్రమోషన్ పొందుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, నెటిజెన్స్, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


పిల్ల జమిందారు సినిమాతో గుర్తింపు..

ఆమె ఎవరో కాదు హరిప్రియ (Haripriya).. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ నాని హీరోగా నటించిన ‘పిల్ల జమిందార్’ సినిమా హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. అచ్చమైన తెలుగు అమ్మాయి సింధు పాత్రలో చాలా అద్భుతంగా నటించింది హరిప్రియ. ఈమె పేరుకే కన్నడ ఇండస్ట్రీ అయినా.. పక్కింటి అమ్మాయిలా అందరి మనసులు దోచుకుంది. ఇక పిల్ల జమిందార్ సినిమాలో హరిప్రియ అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు ‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈమె, రెండో సినిమా పిల్ల జమిందార్ హిట్ కావడంతో ఈమెకు బాగా క్రేజ్ వచ్చింది.


ప్రముఖ నటుడితో పెళ్లి..

ఇక వరుణ్ సందేశ్ తో కలిసి “అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్”, “ఈ వర్షం సాక్షిగా” వంటి సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది అలాగే బాలకృష్ణ(Balakrishna) నటించిన “జై సింహ” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత తెలుగు వెండితెరపై కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. బెల్ బోటమ్, కురుక్షేత్ర, పెట్రో మాక్స్ వంటి బ్లాక్ బాస్టర్ కన్నడ చిత్రాలలో నటించి, కన్నడ ఆడియన్స్ కు దగ్గర అయింది. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే 2023లో వశిష్టాతో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఈమె భర్త కూడా ప్రముఖ నటుడే కావడం గమనార్హం.

బేబీ బంప్ ఫోటోషూట్ వైరల్..

ఈమె భర్త వశిష్ట.. ‘కేజీఎఫ్’ సినిమాలో ప్రతి నాయకుడిగా కనిపించారు. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ , నయీమ్ డైరీస్ వంటి చిత్రాలలో కూడా పనిచేశారు.ఇక చివరిగా చాందినీ చౌదరి లీడ్ రోల్ పోషించిన ఏవమ్ అనే సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే హరిప్రియ 9 నెలల ప్రెగ్నెంట్.. అంటే త్వరలోనే ఈమె ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది అని సమాచారం. తాజాగా ఒక ప్రైవేట్ రిసార్ట్ లో హరిప్రియ సీమంతం వేడుక చాలా ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×