Shock To KTR: తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇప్పటికే వాదనలు జరిగాయి. మంగళవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు విచారణలో ఇలాంటి పిటిషన్లు కుదరవని తేల్చిచెప్పింది. ఆరు వరకు అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని, రూల్ అఫ్ లా అందరికి వర్తిస్తుందని తెలిపింది.
అయితే నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఏసీబీతో పాటు ఈడీ విచారణకు కేటీఆర్ తప్పకుండా హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు కేటీఆర్ హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. ఆపై విచారణకు పిలవనుంది. ఇవాల్టి వరకు విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారు కేటీఆర్. అయితే కోర్టులో చుక్కెదురు కావడంతో ఇప్పటి నుంచి సీనంతా దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లనుంది. ఫార్ములా ఈ-కార్ రేసులో జరిగిన అవినీతిపై తీగలాగనున్నారు ఏసీబీ, ఈడీ అధికారులు.
మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపు తున్నారు. కేసు విచారణలో ఉండగా క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం ఇప్పటివరకు తీర్పు ఇచ్చిన సందర్భాలు లేవు.. రాలేదు కూడా.
ఇప్పటివరకు ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేసిన కేటీఆర్, ప్రజల నుంచి సింఫతీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. న్యాయస్థానం నుంచి క్లారిటీ కేటీఆర్‌పై కాస్తో కూస్తో సానుభూతి కూడా పోయినట్లయ్యిందన్నది ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అలాగే ఏసీబీ సెర్చ్ వారెంట్‌కు కోర్టు అనుమతి పొందింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపే అవకాశాలున్నాయి. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందాలు, హెచ్ఎండీ ద్వారా జరిగిన లావాదేవీలు వివరాలను ఏసీబీ సేకరించనుంది.