Kakani Govardhan Reddy: వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. అధికారంలో ఉన్నట్లుగా అధికారులపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దాని ఫలితంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ జాబితాలో మాజీ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి చేరిపోయారు.
రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అసలు కష్టాలు వైసీపీకి మొదలయ్యాయి. అధికారంలో ఉన్నంత సేపు తమకు ఎదురులేదని భావించేవారు నేతలు, కార్యకర్తలు. వారు చేసిన.. చేస్తున్న విషయాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ గా నెల్లూరు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు అయ్యింది.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు, కాకాణి ముఖ్యఅనుచరుడు వెంకటశేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసింది. దీనిపై న్యాయస్థానం వెంకట శేషయ్యకు రిమాండ్ విధించడం జరిగిపోయింది.
శేషయ్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంపై పార్టీ నేతలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాకాని, అధికారులపై నోరు పారేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వెంకటాచలం సీఐ ఖాకీ దుస్తులు ఊడదీస్తామని, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరిగేటట్టు చేస్తామని వ్యాఖ్యానించారు.
ALSO READ: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారి ఖాతాల్లో ఏకంగా లక్షల్లో నగదు జమ
అంతేకాదు సీఐను విధుల నుంచి తొలగించేందుకు శాశ్వతంగా చర్యలు చేపడతామని అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. కాకాని వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సక్రమంగా జరగకుండా ఉండేలా చేస్తున్నారని ప్రస్తావించారు. దీంతో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.