Tollywood Actress:ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా యాక్సిడెంట్ కి గురైనట్లు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకున్న ఈమె.. ప్రస్తుతం అదే తెలుగులో అవకాశాలు తగ్గడంతో అడపాదడపా చేస్తున్న ఈమె.. మరొకవైపు.. హిందీ, తమిళ్ భాషలలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తెలుగులో సిద్దు జొన్నలగడ్డ (Siddhu jonnalagadda) తో కలిసి ‘తెలుసు కదా’ అనే సినిమాలో చేస్తున్న ఈమె.. బాలీవుడ్లో ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తనకు గాయాలైన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ..” కొన్ని రోల్స్ అడగవు. డిమాండ్ చేస్తాయి. నీ శరీరం.. శ్వాస, గాయాలను లెక్కచేయకూడదు. నువ్వే తుఫానుగా మారినప్పుడు ఈ ఉరుములు నిన్నేమి చేయలేవు.. కమింగ్ సూన్..” అంటూ రాసుకు వచ్చింది. ఇకపోతే ఈ ఫోటోలలో తన ముక్కు నుంచి రక్తం కారుతోంది. కాళ్లకు, చేతులకు కూడా బాగా గాయాలు అయ్యి రక్తం కారుతున్నాయి. ఇది ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు సమాచారం.
రాశీ ఖన్నా కెరియర్..
తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన మనం సినిమాలో అతిథి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అదే ఏడాది జోరు సినిమాలో కూడా నటించింది. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమెకు పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా బెంగాల్ టైగర్, శివం, జిల్, సుప్రీం, హైపర్, జై లవకుశ, రాజా ది గ్రేట్, విలన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, ఇలా చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాశీ ఖన్నా సినిమాలు..
ఇక ఇప్పుడు తెలుగులో కేవలం సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది. అలాగే తమిళంలో అఘాతియా అనే పేరుతో సినిమా చేసింది. ఇక హిందీలో ఒక సినిమా చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఇలాంటి సమయంలో అలాంటి ఫోటోలు షేర్ చేయడంతో నటనకు రాశిఖన్నా ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్లలో గాయాలైన హీరోలను చూసాము నటులను చూసాం కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా తమ శక్తికి మించి నటనలో ప్రూవ్ చేసుకుంటున్నారు మరి ఈ సినిమాలతో వీరికి ఎలాంటి విజయం వరిస్తుందో చూడాలి.
ALSO READ:Jr NTR vs Balakrishna : బాలయ్యతో ఎన్టీఆర్ గొడవలు… ఇది తప్పు అంటూ తారక్‌కు జగపతి బాబు క్లాస్..!