Jr NTR vs Balakrishna :యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. టాలీవుడ్ (Tollywood) లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు తన సినిమాలతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా జపాన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఏకైక తెలుగు హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించారు. ముఖ్యంగా జపాన్ నుంచి ఎన్టీఆర్ నివాసానికి అభిమానులు వస్తున్నారు అంటే ఆయనపై అభిమానం వారికి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ తో నేరుగా మాట్లాడడానికి ఒక జపాన్ మహిళా అభిమాని స్వయంగా తెలుగు నేర్చుకొని మరీ ఆయనను పలకరించింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని దేశాలలో కూడా ఎన్టీఆర్ కి ఈమధ్య భారీగా క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.
బాబాయ్ – అబ్బాయ్ గొడవలపై హీరో స్పందన..
ఇకపోతే కెరియర్ పరంగా అందనంత ఎత్తుకు చేరుకున్న ఎన్టీఆర్ ఇటు ఫ్యామిలీ విషయంలో కాస్త వార్తల్లో నిలుస్తున్నారు. తన బాబాయి బాలయ్య (Balakrishna) తో ఎన్టీఆర్ కి గొడవలు ఉన్నాయి అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు ప్రత్యక్షంగా జరుగుతున్న కొన్ని సందర్భాలు కూడా నిజమే అనిపిస్తాయి. అసలు గొడవలు ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం ఎవరూ కూడా దీనిపై స్పందించరు. దీంతో ఎప్పటికప్పుడు ఈ వార్తలు ఆజ్యం పోసుకుంటూనే ఉన్నాయి. ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే.. ఈ రోజైనా ఇద్దరూ కలిసిపోతారేమో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా.. అనూహ్యంగా జగపతిబాబు (Jagapati babu) పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య గొడవపై స్పందించి , అసలు వీరి మధ్య గొడవ ఉందా అనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
బాలయ్య – ఎన్టీఆర్ మధ్య విభేదాలపై జగపతిబాబు క్లారిటీ..
అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ హీరోగా జగపతిబాబు విలన్ గా తెరకెక్కిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జగపతిబాబుకి ఎన్టీఆర్కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ చనువుతోనే జగపతిబాబు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ బాలయ్య మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ ను ప్రశ్నించగా.. అసలు ఎన్టీఆర్ ఆ విషయంపై ఏమన్నారు? ఎలా స్పందించారు? అనే విషయాన్ని నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఎదుటే జగపతిబాబు వివరించారు. ఇంటర్వ్యూలో భాగంగా లెజెండ్ మూవీలో బాలయ్యతో నటించినప్పుడు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్టీఆర్ తో నటించినప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించగా జగపతిబాబు మాట్లాడుతూ.. “బాలయ్యతో నటించినప్పుడు చాలా బాగుంది. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్. అదృష్టం కొద్ది నాతో అందరూ చాలా సరదాగా ఉంటారు. దీని తర్వాత నాకు తారక్ కి మధ్య ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక చిన్న డిస్కషన్ జరిగింది. తారక్ ని అడిగాను.. ఏంటిది తారక్.. మీది – బాలయ్యది మధ్య ఇష్యు. అది తప్పు కదా.. బాగుంటే అంతా బాగుంటుంది.. అని నా మనసులో అనిపించింది జన్యూన్ గా అడిగాను.
అసలు నిజం ఎన్టీఆర్ మాటల్లోనే..
దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “అసలు ఆయనతో నాకేంటి బాబాయ్ ప్రాబ్లం.. నాకు ఎటువంటి సమస్య లేదు. అసలు ఆ ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలియదు. నా ఫాదర్ బ్రదర్ ఆయన. నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో నాకేంటి గొడవలు ఉంటాయి. అసలు మనసులో కూడా నేను ఏది పెట్టుకోను. ఎప్పటికీ ఆయనంటే నాకు ఇష్టం” అంటూ తన మనసులో మాటను చాలా క్లియర్ గా ఎన్టీఆర్ చెప్పేసారు. అక్కడ బాలయ్య కూడా ఏదైనా మాట్లాడి ఉండవచ్చు కానీ ఎక్స్ట్రా మాట ఇంకోటి మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అందరికీ తెలియడం కోసమే నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇకనైనా బాబాయ్ – అబ్బాయ్ మధ్య గొడవలు అంటూ వార్తలు సృష్టించకండి” అంటూ జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు. మరి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అయినా ఇకనుంచి ఆ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.
ALSO READ:War 2 Official Teaser : బాబాయ్… ఇదేం యాక్షన్… తారక్ లుక్ అయితే నెవ్వర్ బిఫోర్