Husband Kills Third Wife| భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారంతో ప్రవర్తిస్తే ఆ గొడవలు హింసాత్మకంగా మారుతాయి. ఈ గొడవల కారణంగా దంపతులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి జిల్లా అమౌలి గ్రామానికి చెందిన రాజు పాల్ (44) అనే వ్యక్తిని పొరుగు జిల్లా జౌన్ పూర్‌కు చెందిన ఆర్తి అనే 26 మహిళ వివాహం చేసుకుంది. వీరిద్దరికీ మే 9న పెళ్లి జరిగింది. అయితే రాజు పాల్ కు ఇది మూడో వివాహం. మొదటి భార్య అతడి నుంచి విడాకులు తీసుకోగా.. రెండో భార్య అకాలంగా మరణించింది.
ఈ క్రమంలో రాజు, ఆర్తిల మద్య వివాహం జరిగినప్పటి నుంచే గొడవలు మొదలయ్యాయి. సహజంగా కోపిష్టి అయిన రాజు పాల్ తన భార్య ప్రవర్తన సహించలేక ఆమెపై పెళ్లి జరిగిన రెండో రోజే చేయి చేసుకున్నాడు. ఆ తరువాత ఇది ప్రతి రోజు పని అయిపోంది. ఈ క్రమంలో ఆర్తి, రాజు ల మధ్య మే 16న జరిగిన గొడవలో ఆర్తిని ఆమె భర్త రాజు తీవ్ర కొట్టి ఆమె మెట్లపై నుంచి తోసేశాడు. ఈ కారణంగా ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ పొరుగింటి మహిళ ఆర్తిని కలిసేందుకు వచ్చి.. అక్కడ రక్తపు మడుగుల పడి ఉన్న ఆర్తిని చూసి షాక్ కు గురైంది. వెంటనే తన కుటుంబం సాయంతో ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ సమాచారం పోలీసులకు అందచేయడంతో.. పోలీసులు ఆర్తి శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించి.. విచారణ కోసం రాజు పాల్ ని అరెస్ట్ చేశారు.
పిల్లలు పుట్టలేదని మహిళను కృూరంగా చంపిన అత్తమామలు
కర్ణాటక రాష్ట్రంల బెలగావి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళకు పిల్లలు పుట్టడం లేదని ఆమె భర్త, అత్తమామలు కలిసి ఆమెను చాలా కృూరంగా హత్య చేశారు. బెలగావి జిల్లా, అథాని తాలుకా, మలబాడ్ గ్రామానికి చెందిన సంతోష్ హొనకాండె (30) అనే యువకుడికి రేణుకా అనే 27 ఏళ్ల యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ రెండేళ్లుగా వారికి సంతానం కలుగులేదు.
ఈ కారణంగానే సంతోష్ తల్లి జయశ్రీ, తండ్రి కామన్న తమ కొడుకు సంతోష్ కు పిల్లలు పుట్టడం లేదని మరో యువతితో వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఈ విషయం తెలిసి సంతోష్ భార్య రేణుకా వారిని వ్యతిరేకించింది. కోర్టులో వారిపై న్యాయపోరాటం చేస్తానని బెదిరించింది. దీంతో సంతోష్, అతని తల్లిదండ్రులు తమక ఏ సమస్య రాకూడదంటే రేణుకను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అందుకే రాత్రి 8 గంటల సమయంలో సంతోష్ తన భార్యను బైక్ పై ఊరి చివర తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సంతోష్ తల్లిదండ్రులు వేచి ఉన్నారు. ఆ తరువాత రేణుకను రోడ్డుపైన పడేసి ఆమె తలపై బండరాయి తో కొట్టారు.
Also Read: అనాథ అని చేరదీస్తే తల్లినే చంపిన బాలిక.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?..
ఆ గాయాల కారణంగా రేణుకా కొనఊపిరితో ఉండగా.. ఆమె గొంతుకు చీర బిగించి, బైక్ పై ఈడ్చకుంటూ వెళ్లారు. దీంతో రేణుకా మరణించింది ఆ తరువాత సంతోష్ ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి.. తన భార్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిందని నటించాడు. ఆస్పత్రిలో డాక్టర్లు రేణుగా చనిపోయిందని చూసి.. ఆమె శరీరంపై ఉన్న గాయాల పట్ల ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు విచారణ చేయగా.. సంతోష్ చేసిన పాపం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణలో భాగంగా రేణుకా అత్తమామలను కూడా అదుపులోకి తీసుకున్నారు.