Anupama :ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ ప్రేమమ్’ సినిమాతో తెలుగు హృదయాలను మాయ చేసిన ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం వహించిన ‘అ, ఆ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తర్వాత ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జీవితం’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘రాక్షసుడు’, ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక చివరిగా ‘డీజే టిల్లు’ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఇప్పుడు అందులో భాగంగానే పలు క్రేజీ చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
లిప్ లాక్ తో రెచ్చిపోయిన అనుపమ..
ఇదిలా వుండగా.. సడన్ గా రెండు రోజుల క్రితం ఒక యంగ్ హీరోతో లిప్ లాక్ పెడుతున్న ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎవరు ఆ హీరో ?అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. అయితే ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram )కొడుకు యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram). ఇతడితో ఆమె లిప్ లాక్ పెడుతున్న ఫోటోని షేర్ చేయగా.. ఈ ఫోటో ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇక అతడితో డేటింగ్ లో ఉందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అందుకే ఈ రేంజ్ లో ముద్దులు పెట్టుకుని, ఆ ఫోటోలను షేర్ చేశారు అంటూ తమిళ్ మీడియా కోడై కూస్తోంది.
అనుపమ రిప్లై కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..
అసలు విషయంలోకి.. వాస్తవానికి ఇప్పుడు అనుపమతో కలిసి ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
మరి ఇది సినిమా కోసం పెట్టుకున్న ముద్దా లేక రియల్ గా పెట్టుకుందా అన్నది దీనిపై ఇద్దరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. క్లారిటీ కోసం అనుపమ డైహార్డ్ ఫాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అది రియల్ కాదు.. సినిమా కోసం చేసిన రీల్ స్టంట్ అని ఆమె చెబితే వినాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి అనుపమ దీనిపై ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
ధృవ్ విక్రమ్ సినిమాలు..
ధ్రువ్ విక్రమ్ విషయాన్నికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ గా వచ్చిన ‘ఆదిత్య వర్మ’ అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన తండ్రితో కలిసి చేసిన ‘మహాన్’ సినిమా కూడా ఆయనకు గుర్తింపును అందించింది. ఇప్పుడు మారి సెల్వరాజు దర్శకత్వంలో ‘బైసన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో ధృవ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తూ ఉండగా.. ఇతడికి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇక అందులో భాగంగానే లిప్ లాక్ పెట్టుకున్నారని ఒక వర్గం ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమ రిప్లై ఇచ్చే వరకు అభిమానులు ఆగేలా లేరని తెలుస్తోంది.
Tollywood Heroine: గర్భాన్ని దాస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్..ఎవరంటే..?