BigTV English

Tollywood Hit Movies 2024 : ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలు.. కలెక్షన్లు మోతే..

Tollywood Hit Movies 2024 : ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలు.. కలెక్షన్లు మోతే..

Tollywood Hit Movies 2024 : 2023 తో పోలిస్తే 2024 టాలీవుడ్ లో సందడి మాములుగా లేదు. థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరో నెలలో 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ఊహించని రీతిలో హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక భారీ అంచనాలున్న సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోలెవరూ తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రాకపోవడంతో, ఈ గ్యాప్ ను చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాతో పూర్తి చేసారు. ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్ క్రికెట్ వల్ల జనాలు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. టాక్ బాగున్న సినిమాలను మాత్రమే జనాలు ఆదరించారు. దీపావళి వరకు విడుదలైన సినిమాలు ఏవి? అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


హను-మాన్… 

సంక్రాంతి సినిమాల రేసులో హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ.. స్టార్ హీరోల సినిమాలను తట్టుకొని కూడా బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 345 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది.


గుంటూరు కారం.. 

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటీ ఫుల్ హీరోయిన్ శ్రీలీలా జంటగా నటించిన మూవీ గుంటూరు కారం.. చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే మహేశ్ స్టార్ పవర్ తో సినిమాని గట్టెక్కించారు.

నా సామిరంగా..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన ‘నా సామి రంగా’ చిత్రం 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అన్ని ఏరియాలో గ్రీక్ ఈవెన్ మార్క్ అందుకుంది.. నాగార్జునకు ఈ మూవీ హిట్ టాక్ ను అందించిందనే చెప్పాలి..

టిల్లు స్క్వేర్.. 

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 135 కోట్ల వరకూ రాబట్టి, బ్లాక్ బస్టర్ సినిమాలో లిస్టులో చేరిపోయింది.

గామి.. 

విశ్వక్ సేన్, చాందిని నటించిన ‘గామి’ మూవీ హిట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది..

ప్రేమలు..

మమితా బైజు నటించి మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు. కలెక్షన్ కూడా భారీగానే అందుకుంది..

కల్కి 2898 AD.. 

పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ నెలాఖరున థియేటర్లలోకి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 700 కోట్ల కలెక్షన్లు రాబట్టి, 2024 లో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. రూ. 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను అందుకుంది..

దేవర.. 

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర.. ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్న కూడా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని హిట్ అయ్యింది.

ఇక దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఈ ఏడాది చివరిలో పుష్ప 2, తండేల్ సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×