Rythu Panduga: రెండు లక్షలు రుణం తీసుకుని మాఫీ కాని రైతులకు మహబూబ్ నగర్ రైతు పండుగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రుణమాఫీ జరగని 3.14 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు.
Also read: కేటీఆర్.. ఇక కనపడరా? ఆ పరాభావంతో ఊహించని నిర్ణయం, ఇక కేసీఆర్ లాగే..
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వం రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసింది. కొంతమందికి ఆధార్ లో సమస్యలు, టెక్నికల్ కారణాలు, రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉండటం వల్ల మాఫీ అవ్వలేదు. ఆ రైతులకు కూడా న్యాయం జరిగేలా నేడు రైతుపండుగ సభలోనే నిధులను విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.1 లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకే రుణమాఫీ చేశారు. 23 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు.
రుణమాఫీ ఒకేసారి కాకుండా విడతల వారిగా చేశారు. కానీ కాంగ్రెస్ హయాంలో రూ.2లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేసినప్పటికీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రైతులను రెచ్చగొట్టడంతో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. పదే పదే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టింది. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.