BigTV English

Brahmanandam : ఎమ్మెస్ చేసిన పనిని జీర్ణించుకోలేకపోయా… బ్రహ్మీ షాకింగ్ కామెంట్

Brahmanandam : ఎమ్మెస్ చేసిన పనిని జీర్ణించుకోలేకపోయా… బ్రహ్మీ షాకింగ్ కామెంట్

Brahmanandam.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం(Brahmanandam) చాలాకాలం తర్వాత తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజా(Gautham Raja) తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా చేశారు. ఇందులో తండ్రీ కొడుకులు కాస్త తాతా మనవడిగా నటించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రహ్మానందం.. అదే సమయంలో తన స్నేహితుడు ఎమ్.ఎస్ నారాయణ (MS.Narayana)ను తలుచుకొని, భావోద్వేగానికి గురవడం అందరిని కలచివేసింది. ఇక ఆ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఏం మాట్లాడారు? ఎం ఎస్ నారాయణ చేసిన పనిని జీర్ణించుకోలేకపోయాను అని కూడా చెప్పాడు ? అసలు ఏమైంది ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


ఎమ్మెస్ చివరి క్షణాలలో నన్నే చూడాలన్నారు – బ్రహ్మీ..

అసలు విషయంలోకెళితే.. బ్రహ్మానందం ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను సంపాదించిన సంపద నమ్మకం. ఒక వ్యక్తి.. ఒక జీనియర్.. తన డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి.. అతడికి ఎంతోమంది తెలుసు.. ఎన్నో పరిచయాలు కూడా ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు ఇలా అనేక బంధాలు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలి అనిపించడం.. ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకోవడం.. నోటితో తన కోరికను చెప్పలేక.. మాట్లాడలేని పరిస్థితిలో.. ఏం చేయాలో తెలియక.. పక్కనే వున్న తన కూతురికి సైగ చేసి.. తన కూతురితో తెల్ల కాగితం మీద..” నేను బ్రహ్మానందం అన్నను ఇప్పుడే చూడాలి” అని రాసి ఇచ్చాడట. ఇక అమ్మాయి అది చదువుకొని నాకు ఫోన్ చేసింది ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్లో ఉన్న నేను.. దర్శకుడు దగ్గరకు వెళ్లి..తాను అడిగిన విషయం చెబితే ఏమంటారో అనే భయం వేసి, ఆ తర్వాత అలాగే కారు ఎక్కి వెళ్ళిపోయాను’’ అని అన్నారు.


అతి చిన్న వయసులోనే మరణం.. జీర్ణించుకోలేకపోతున్నా..

‘‘అక్కడి నుంచి ఎమ్మెస్ నారాయణ చూడడానికి వెళ్లగానే బెడ్డు పైనుంచి నన్ను చూసి రెండు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చేయి పట్టుకొని అక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక చూస్తుండగానే ప్రాణాలు వదలడం చూసి ఇప్పటికే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకరకంగా చెప్పాలి అంటే ఆయన నా రక్తసంబంధం కాదు.. కానీ అదే ఒక హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులోనే వెళ్ళిపోతాడు అని నేను అనుకోలేదు. అంటూ బ్రహ్మానందం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రేమ , నమ్మకం అనే దానికి బంధం బంధుత్వంతో పనిలేదు.. మనసుకు నచ్చినవారిని రక్తసంబంధీకులు కాకపోయినా వారిని కలవాలని చివరి క్షణంలో కోరుకుంటారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. దానినే గొప్ప స్నేహం అని కూడా అంటారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ మరణించడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అయితే మనకు స్పష్టం అవుతుంది. బ్రహ్మానందం విషయానికి వస్తే.. దాదాపు 1200 కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×