E-Paper
Advertisement

Rewind 2023: సినీ వివాదాలు.. ఎక్కువగా వార్తల్లో నిలిచినవి ఇవే..

Rewind 2023: సినీ వివాదాలు.. ఎక్కువగా వార్తల్లో నిలిచినవి ఇవే..
Advertisement
Tollywood Rewind 2023

Rewind 2023: 2023 రెండ్రోజుల్లో ముగియనుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. 2023లో సినీ ఇండస్ట్రీలో కొన్ని వివాదాలు ప్రకంపనలు సృష్టించాయి. కొన్ని అభిమానుల ఫీలింగ్స్ ను దెబ్బతీస్తే.. మరికొన్ని ఇండస్ట్రీలో హీట్ పెంచాయి. కొన్ని వివాదాల్లో నటీనటులే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి 2023లో ఇండస్ట్రీలో జరిగిన వివాదాల్లో వార్తల్లో నిలిచినవేంటో ఒక్కసారి చూద్దాం.

2023 ఇండస్ట్రీ వివాదాలు అనగానే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్స్ సమంత, త్రిష. వీరిద్దరిపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Advertisement

మయోసైటిస్ తో బాధపడిన సమంత.. కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించింది. ఈ క్రమంలో ఒక నిర్మాత ఆమెకు ఎలాంటి వ్యాధి లేదు.. కేవలం సానుభూతి కోసమే అలా చెబుతోందంటూ చేసిన కామెంట్స్ పై సమంత తీవ్రంగా రియాక్ట్ అయింది. నిర్మాత వ్యాఖ్యలకు సమంత ఇచ్చిన కౌంటర్లతో సోషల్ మీడియా హీటెక్కింది.

ఇండస్ట్రీని షేక్ చేసిన మన్సూర్-త్రిష వివాదం

Advertisement

నటుడు మన్సూర్ అలీఖాన్.. త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఖండిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్ లు చేయగా.. వారందరిపై మన్సూర్ పరువునష్టం దావా వేశారు. ఆ కేసును తాజాగా కోర్టు కొట్టివేసి.. ప్రచారం కోసమే మన్సూర్ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ రూ.లక్ష జరిమానా విధించింది. ఇంతటితో ఈ వివాదం ముగిసింది.

మంచుబ్రదర్స్ కోల్డ్ వార్

మంచు మనోజ్ పెళ్లి కంటే.. మంచు బ్రదర్స్ గొడవ పడుతున్న వీడియోనే హాట్ టాపిక్ గా నిలిచింది. మంచు విష్ణు గొడవపడుతున్నట్లుగా ఉన్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. కొద్ది నిమిషాలకే ఆ వీడియోను తీసేసినా.. కొన్ని కొటేషన్లతో పరస్పర పోస్టులు చేశారు. దాదాపు వారంరోజులపాటు జరిగిన ఈ కోల్డ్ వార్ పై మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఇదంతా ప్రాంక్ అని, ఒక రియాలిటీ షో కోసం ఇదంతా చేశామని విష్ణు చెప్పాడు.

అనసూయ-విజయ్ ‘ది’ వివాదం

నటి అనసూయ – విజయ్ దేవరకొండకు మధ్య X వేదికగా జరిగిన వివాదం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండను కూడా దీనిపై ప్రశ్నించారు. ఖుషి సినిమా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండటాన్ని తప్పుపడుతూ అనసూయ చేసిన వరుస ట్వీట్స్.. అతని అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. అనసూయను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఒక న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు మానసిక ప్రశాంతత కావాలంటూ అనసూయ ‘ది’ వివాదానికి ముగింపు పలికారు.

ఆదిపురుష్ పై ఆగ్రహాలు

2023లో విడుదలైన ఆదిపురుష్ పై భిన్నస్వరాలు వినిపించాయి. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించడంతో.. విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ.. పోస్టర్లు, ట్రైలర్లను చూసినప్పటి నుంచి తీవ్రంగా ట్రోల్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక.. సినీ, రాజకీయ రంగాల్లో చర్చలకు దారితీసింది. సీతాదేవి పుట్టింది నేపాల్ లో అయితే.. సినిమాలో భారత్ లో పుట్టినట్లు చూపించారంటూ రాజధాని కాఠ్ మండూ మేయర్ బలెన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చిత్ర విడుదలపై నిషేధం విధించారు. అలహాబాద్ హైకోర్టు సైతం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

వివాదాల్లో టాప్.. రానా నాయుడు..

వెంకటేశ్- రానా తండ్రి కొడుకులుగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యాక వివాదాలకు వేదికైంది. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని విమర్శలు రావడంతో.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ను ఆపేశారు. అయితే తాజాగా ఈ సిరీస్ ఒక ఘనత సొంతం చేసుకుంది. 2023 జనవరి నుంచి జూన్ వరకూ అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 400 చిత్రాలు – సిరీస్ లలో రానా నాయుడు 366వ స్థానంలో నిలిచింది. 46 మిలియన్ల గంటలు ఈ వెబ్ సిరీస్ చూశారని నెటిఫ్లిక్స్ వెల్లడించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×