BigTV English

Japanese Happy Life: జపనీయుల హ్యాపీ లైఫ్ రహస్యాలివే..!

Japanese Happy Life: జపనీయుల హ్యాపీ లైఫ్ రహస్యాలివే..!

Japanese Happy Life: ఆసియాలోని ప్రాచీన దేశాల్లో జపాన్ ఒకటి. అత్యంత ఎక్కువ ఆయుర్దాయం(86) గల పౌరులున్న ఈ దేశంలో మెజారిటీ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఐదు పదుల వయసులోనూ అత్యంత అందంగా కనిపించే జపనీయలు.. తమ ఆరోగ్యం విషయంలో వారు తీసుకునే జాగ్రత్తలు, పాటించే అలవాట్ల మూలంగానే ఇంత హాయిగా జీవిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు.


పరిశుభ్రత, పోషకాహారం, క్రమశిక్షణ, ప్రకృతితో మమేకం కావటం అనే నాలుగు అంశాలకు జపనీయులు విశేష ప్రాధాన్యతను ఇస్తారు. జపనీయులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతతో బాటు బయటికి వెళ్లినప్పుడూ అదే నియమాన్ని పాటిస్తారు. వీరి శుభ్రత ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. ఈ దేశంలో కరెన్సీ నోట్లను నేరుగా చేతులతో లెక్కించటం, జేబులో పెట్టుకుని తిరగటం చేయరు. ఏ షాపుకెళ్లినా డబ్బు వేసేందుకు ఒక ట్రే ఉంటుంది. తాము చెల్లించాల్సిన మొత్తాన్ని జనం నేరుగా అందులో వేస్తారు. అందుకే అక్కడి కరెన్సీ నోట్లు కూడా తళతళ మెరిసిపోతుంటాయి.

జపనీయులు తమ పిల్లలకు బాల్యం నుంచే గట్టి క్రమశిక్షణను అలవాటు చేస్తారు. ఇంట్లోనైనా, స్కూల్లోనైనా పిల్లలు విధిగా తమ చెప్పులు తీసి అక్కడి ర్యాక్‌లో పెట్టాల్సిందే. అంతేకాదు.. ఎవరినైనా కలిసేందుకు వెళితే.. అనుకున్న టైం కంటే 10 నిమిషాల ముందే అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటారు. లేట్‌గా వెళ్లడం అంటే అవతలి వాళ్లను అవమానించడంగా భావిస్తారు.


ద్వీప దేశమైన జపాన్‌లోని ప్రత్యేక వాతావరణం కారణంగా అక్కడ వండిన ఆహారం త్వరగా పాడైపోతుంది. కనుక వీరు ఎప్పటికప్పుడు వండుకుని వేడిగా తింటారు తప్ప ప్యాక్డ్ ఫుడ్ ముట్టరు. వీరు తీసుకునే మిసో, నాట్టో, సోయా వంటి పులిసిన ఆహారం వల్ల వీరి ఇమ్యూనిటీ, జీర్ణశక్తి బాగుంటుంది.

జపనీయులు ఏదీ కడుపునిండా తినకుండా, పొట్టలో కాస్త ఖాళీగా ఉండేలా చూసుకుంటారు. భోజనానికి వీరు వాడే ప్లేట్లు కూడా చిన్నవిగానే ఉంటాయి. పైగా.. వీరు సీ ఫుడ్, పాలు కలపని తేలికపాటి టీ ఎక్కువగా తీసుకుంటారు కనుక వీరికి ఊబకాయం, కొలెస్ట్రాల్‌ల బెడద తక్కువ.

రోజులో వీరు మూడుసార్లుగా ఆహారం తీసుకుంటారు. మొదటి మీల్‌లో ప్రొటీన్లు, రెండవ మీల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌ను అందించే చేపలను, మూడవ మీల్‌లో పండ్లు, తాజా కూరగాయల సలాడ్స్ ఉంటాయి. దీనివల్ల వీరి చర్మం 50 ఏళ్లు దాటినా స్మూత్‌గా, మెరుస్తూ ఉంటుంది.

జపాన్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు క్రమబద్ధంగా ఉంటుంది. బస్సు, రైలు ప్రయాణికులు.. దగ్గినా, తుమ్మినా చేయి అడ్డం పెట్టుకోవటం, జలుబు, దగ్గు ఉంటే తప్పక మాస్క్ వాడటం చేస్తారు. ప్రయాణాల్లో మౌనంగా ఉంటారు. ఎంత పెద్ద లైన్ ఉన్నా.. ఓపిగ్గా వెయిట్ చేస్తారు. 2011 నాటి సునామీ సమయంలోనూ జపనీయులు ఫుడ్, వాటర్ కోసం క్యూ పద్ధతిని పాటించటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఇక్కడి ప్రజలు.. తమ రోజువారీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ స్నానం కోసం ప్రత్యేకంగా టైం కేటాయిస్తారు. స్నానానికి జపనీయుల జీవన విధానంలో ప్రత్యేక స్థానం ఉంది. వీరు మూలికలు కలిపిన నీటితో అరగంట నుంచి 50 నిమిషాల పాటు స్నానం చేస్తూ రిలాక్స్ అవుతారు.

జపాన్ వాసులు కనీసం 15 రోజులకోసారి.. ఫారెస్ట్ బాతింగ్ చేస్తారు. అంటే పచ్చని అడవిలో గంటల తరబడి గడపటం, నడవటం, యోగా వంటివి చేయటం చేస్తుంటారు. అలాగే.. ఓ మాదిరి దూరాలకు నడకనే ఆశ్రయిస్తారు లేదా సైకిల్ మీద పోతుంటారు. దీనికి తోడు రోజుకు అరగంటైనా వ్యాయామం చేస్తారు. నేల మీదే పడుకోవటం వీరికి అలవాటు కనుక వీరికి వెన్ను, నడుము నొప్పి లాంటివి తక్కువ.

జపనీయులు.. ‘షింటో’ సంప్రదాయాన్ని నమ్ముతారు. వీరి భాషలో షింటో అంటే.. శరీరాన్ని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇందులో భాగంగా జపనీయులు ఇతరులతో మాట్లాడేటప్పడు కల్మషం, దాపరికం, అబద్దాలు లేకుండా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×