OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ మూవీ లవర్స్ కి ఈరోజుల్లో ఒక వరం అని చెప్పుకోవచ్చు. థియేటర్లలో ఎన్ని సినిమాలు వచ్చినా కొద్దిరోజులలోనే డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యూత్ ని ఎంటర్టైన్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “స్నో వైట్ అండ్ హర్ సెవెన్ లవర్స్” (Snow white and her 7 Lovers). ఈ మూవీలో ఒక దీవిలో ఏడు మంది ఖైదీల చేతులో ఒక అమ్మాయి ఇరుక్కుపోతుంది. ఆ అమ్మాయి వాళ్ళను ఏం చేసిందనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కొంతమంది ఖైదీలను చరసాలలో బంధించడానికి సముద్రమార్గం ద్వారా, ఒక షిప్ లో తీసుకు వెళుతూ ఉంటారు పోలీసులు. ఆ షిప్ కు ప్రమాదం జరగటంతో అందులోని ఖైదీలు తప్పించుకొని ఒక దీవిలోకి వెళ్తారు. వాళ్లకు బయటకు వెళ్ళే దారి లేకపోవడంతో ఆ దీవిలోనే ఉండిపోతారు. అలా ఒకరోజు ఆ దీవికి ఒక అమ్మాయి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఈ ఖైదీలకు కనిపిస్తుంది. ఆ ఖైదీలు ఆమె దగ్గరకు వెళ్ళి కాపాడతారు. మొదట వాళ్లని చూసిన ఆ అమ్మాయి భయపడుతుంది. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆ ఏడు మంది ఖైదీలు ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా అనుభవించాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆ ఏడు మంది ఆమె దగ్గరకు వచ్చి మేమంతా నిన్ను పెళ్లి చేసుకుంటాం అని అడుగుతారు. అందుకు ఆ అమ్మాయి మీ ఏడు మందిలో నేను ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని సమాధానం చెబుతుంది.
అలా ఈ ఖైదీలు ఒకరిని ఒకరు చంపుకుంటే తాను సేఫ్ అవుతాను అనుకుంటుంది. ఈ విషయం తెలియని ఆ ఖైదీలు ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలుపెడతారు. పాముతో కరిపించి, విష ప్రయోగం చేసి రక రకాలుగా చంపుకుంటారు. అందరూ చనిపోయాక చివరికి ఆ దీవిలో హీరోయిన్ మాత్రమే మిగులుతుంది. ఇంతకీ ఆమె ఆ దీవి నుంచి ప్రాణాలతో బయటపడగలుగుతుందా? ఆ దీవికి ఆమె ఒంటరిగా ఎలా రాగలిగింది? ఆ దీవిలో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “స్నో వైట్ అండ్ హర్ సెవెన్ లవర్స్” (Snow white and her 7 Lovers) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ చూస్తున్నంతసేపు మూవీ లవర్స్ బాగా ఎంటర్టైన్ అవుతారు.