E-Paper
Advertisement

Sitara Jewellery Ad : అచ్ఛం ప్రిన్సెస్ లా ఉంది.. వావ్ అనిపించిన సితార!

Sitara Jewellery Ad : అచ్ఛం ప్రిన్సెస్ లా ఉంది.. వావ్ అనిపించిన సితార!
Advertisement
Sitara Jewellary Ad

Sitara Jewellery Ad : వావ్! ఈ యాడ్ చూసిన తరువాత మీకు కలిగే ఫీలింగ్ ఇదే! వావ్ తరువాత ఎంత అందమైన ఎక్స్ ప్రెషన్ పెడతారో మీ ఇష్టం. ఎందుకంటే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార యాక్ట్ చేసిన యాడ్ చూస్తే కలిగే ఫీలింగ్ ఇదే. యాక్టింగ్ లో ఓకే అనుకున్నా.. 11 ఏళ్ల వయసులో ఆమె చూపించిన స్కిల్స్ కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. అరే! టాలీవుడ్ లో ఏ సెలబ్రెటీకీ పిల్లలకూ సాధ్యం కాని రీతిలో సితార యాక్ట్ చేసిందంటే నమ్మగలరా! పైగా ఆ యాడ్ కి ఆమెకు వచ్చిన అమౌంట్ కూడా తక్కువేమీ కాదు. టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి చూస్తే.. ఫస్ట్ యాడ్ కే దాదాపు రూ.కోటి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఎంతైనా కృష్ణ మనవరాలు కదా.. ఆ దానగుణం ఎక్కడికి పోతుంది.. అందుకే తనకు అందిన మొత్తాన్ని అలాగే ఓ ఛారిటీకి ఇచ్చేసినట్టు స్వయంగా సితారనే చెప్పింది. గ్రేట్ కదా!

Advertisement

ఓ నగల సంస్థ యాడ్ లో నటించిన సితారకు ఇదే ఫస్ట్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అయినా బాగా చేసిందనే చెప్పాలి. యాక్టింగ్ ఇంకొంచెం మెరుగుపడాలి. అక్కడక్కడా ఎక్స్ ప్రెషన్ కొంచెం మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్ గా చూస్తే గుడ్. గౌతమ్ ని క్రాస్ చేసేలా దూసుకుపోయింది. సితార్ చాలా పాటలకు డ్యాన్సర్ గా చేసింది. అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు యాక్టింగ్ చేస్తోంది.

మొత్తానికి ఘట్టమనేని ఇంట తొలిసారిగా వారి వారసురాలు స్క్రీన్ లో కనిపిస్తోంది. అంతకుముందు కృష్ణ తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఇప్పుడు మాత్రం సితార విషయంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సో.. ఘట్టమనేని ఫ్యామిలీ హ్యాపీ. ఇక తొలి యాడ్ తోనే అటు టాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సితార.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో ఇంకేం వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అన్నట్టు.. సితార నటించిన యాడ్ ఫుల్ వీడియోను మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×