BigTV English

Sharwa @35: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Sharwa @35: శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Sharwanand new movie update


Sharwanand 35th Movie named “Manamey” Glimpse Released: టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ సినిమాను అనౌన్స్ చేసాడు.

కాగా ఆ మధ్యలో శర్వానంద్ తన ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో బిజీ బిజీగా ఉండటంతో ఈ మూవీకి కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కింది. ఈ రోజు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ని ఇవాళ అనౌన్స్ చేసారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గానూ ‘మనమే’ అనే టైటిల్‌ని మేకర్స్ ఖరారు చేసారు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక టైటిల్ అనౌన్స్‌ చేస్తూ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టిని, అలాగే ఒక చిన్న బాబుని చూపించారు.

READ MORE: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..

దీని బట్టి చూస్తే ఈ మూవీ నాని ఇటీవల నటించిన ‘హాయ్ నాన్న’ మాదిరిగా ఉండబోతుందా? లేదా ఇంకో కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అనేది చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈ మూవీలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓ నాలుగేళ్ల బాబు చుట్టూ ఈ మూవీ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ పాత్రను విక్రమ్ ఆదిత్య చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అబ్దుల్ హేషమ్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×