BigTV English

Underwater Metro Section: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

Underwater Metro Section: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో..  ప్రారంభించిన ప్రధాని మోదీ..

pm modi inaugurates underwater metroUnderwater Metro Section to be Inaugurated by PM Modi(Telugu news live): దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగున పరిగెత్తే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అధునాత అండర్‌ వాటర్‌ మెట్రో రైల్ సర్వీస్‌‌ను కోల్‌కతాలో ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్‌కతా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు 120 కోట్లతో దీనిని నిర్మించారు. ఈ సొరంగ రైలు మార్గం హుగ్లీ నది కింద ఉంది.


కోల్‌కతా ఈస్ట్-వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూ భాగంలో ఉంటుంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ ఉంది. ఇందులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. ఈ టన్నెల్‌ను మెట్రో రైలు 45 సెకన్లలో దాటేస్తుంది. ఈ కారిడార్‌ పరిధిలో ఎస్‌ప్లెనెడ్‌, మహాకారణ్‌, హౌరా, హౌరా మైదాన్‌ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.

లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీస్ మాదిరిగా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించారు. ఈ వినూత్న ప్రాజెక్టుతో రైలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తుంది.


Read More: డీకే శివకుమార్‌‌కు ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు..

కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రయాణికులు భయాందోళనలకు గురవకుండా.. పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సాంకేతిక సమస్యల నుంచి సులువుగా బయటపడేలా ముందుజాగ్రత చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×