E-Paper
Advertisement

Tollywood Heroes: హీరోలందరూ వెకేషన్ మోడ్ లో ఉంటే ఎలా.. ?

Tollywood Heroes: హీరోలందరూ వెకేషన్ మోడ్ లో ఉంటే ఎలా.. ?
Advertisement

Tollywood Heroes: ఈ బిజీ లైఫ్ లో కుటుంబానికి కాస్తా టైమ్ ఇచ్చేవారు చాలా తక్కువ. కానీ, మన హీరోలు మాత్రం ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇంకోపక్క కుటుంబానికి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. ఆ విషయంలో టాలీవుడ్ హీరోలను కొట్టేవారే లేరు. కొద్దిగా టైమ్ దొరికినా కూడా కుటుంబాలతో కలిసి వెకేషన్స్ చెక్కేస్తూ ఉంటారు. తాజాగా స్టార్ హీరోలు ముగ్గురు వెకేషన్ ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు. వారెవరో చూద్దాం.

మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సినిమాల కంటే కుటుంబమే ఎక్కువ ముఖ్యం. సినిమా షూటింగ్ ను కొన్ని రోజులు వాయిదా వేసి అయినా కూడా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లాల్సిందే. ఏడాదిలో దాదాపు నాలుగు సార్లు అయినా లాంగ్ వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మహేష్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం మహేష్, రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈలోపు కుటుంబంతో వెకేషన్స్ కు వెళ్లి వచ్చేదామనే ప్లాన్ లో మహేష్ ఉన్నాడు.

Advertisement

ఎన్టీఆర్: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా మారాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ చాలా రేర్ గా కుటుంబంతో కలిసి ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పిల్లలు చిన్నవారు కావడంతో.. వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్.. కుటుంబంతో చాలాసార్లు వెకేషన్స్ కు వెళ్లి వచ్చాడు. తాజాగా దేవర గోవా షెడ్యూల్ పూర్తికావడంతో.. కొత్త షెడ్యూల్ కోసం థాయ్ ల్యాండ్ కు బయల్దేరాడు. అక్కడకు కుటుంబాన్ని కూడా తీసుకువెళ్లాడు. షూటింగ్ ఫినిష్ చేసిన వెంటనే కుటుంబంతో ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఎన్టీఆర్ ఉన్నాడు. త్వరలోనే ఈ కుటుంబం ఇండియాకు రానుంది.

నాని: న్యాచురల్ స్టార్ నాని .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ సినిమాల మధ్య ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని వెకేషన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కుటుంబంతో కలిసి నాని అమెరికా వెళ్లనున్నాడు. అక్కడే కుటుంబంతో హ్యాపీగా గడపనున్నాడట. ఇక ఇలా స్టార్ హీరోస్ అందరూ వెకేషన్స్ లో ఉంటే ఎలా బ్రో.. షూటింగ్స్ అప్డేట్స్ అని అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×