BigTV English

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Tollywood Heroine:గతంలో హీరోయిన్స్ గా పలు చిత్రాలలో నటించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమై, సడన్ గా సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు ప్రత్యక్షమైతే అభిమానులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా ఒకప్పుడు వరుస చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఎంతోమంది హీరోయిన్స్ సడన్ గా ఇండస్ట్రీకి దూరమై, ఇప్పుడు ఒక్కొక్కరిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వారిని చూస్తూ.. అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా సడన్గా ఒక హీరోయిన్ తన భర్తకు యాక్సిడెంట్ జరిగింది అంటూ వార్తల్లో నిలిచింది ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన హీరోయిన్ భర్తకు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు.


ప్రీతి జింగ్యానీ భర్తకు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స..

ఆమె ఎవరో కాదు.. గతంలో హీరోయిన్ గా నటించిన ప్రీతి జింగ్యానీ భర్తకు తాజాగా యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈమె తెలుగులో తమ్ముడు, నరసింహనాయుడు తదితర చిత్రాలలో నటించింది ప్రీతి జింగ్యానీ. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.ఇకపోతే ప్రీతి జింగ్యాని, బాలీవుడ్ నటుడు , డైరెక్టర్ గా పేరుపొందిన పర్వీన్ దబాస్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. ఈరోజు ఉదయం పర్వీన్ కారులో వెళుతూ ఉండగా.. యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఈ నటుడిని బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం అయితే పర్వీన్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పర్వీన్ ప్రో పంజా లీగ్ కో ఫౌండర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.


Tollywood Heroine: Accident to Telugu heroine's husband.. Admission in ICU.!
Tollywood Heroine: Accident to Telugu heroine’s husband.. Admission in ICU.!

పర్వీన్ దబాస్ హెల్త్ బుల్లెట్ విడుదల చేస్తున్న ప్రో పంజా సభ్యులు..

ప్రో పంజా సభ్యులు కూడా పర్వీన్ దబాస్ గురించి మాట్లాడుతూ .. ప్రస్తుతం పర్వీన్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతడు కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లుగా వైద్యులు తెలియజేశారని , అతని ఆరోగ్యం గురించి మేము అభిమానులకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటామంటూ వెల్లడించారు. అయితే తన భర్తకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన ప్రీతి జింగ్యాని హుటాహుటిగా హాస్పిటల్ కి చేరినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. పర్వీన్ దబాస్ కుటుంబం తోపాటుగా ప్రో పంజా లీగ్ మెంబర్స్ అందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అటు అభిమానులు, స్నేహితులు కూడా పర్వీన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే హీరోయిన్ ప్రీతి విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ ను తన అందంతో , నటనతో ఆకట్టుకున్న ఈమె.. ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు చాలా కాలం తర్వాత భర్త కారణంగా వార్తల్లో నిలవడంతో ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈమె అందంలో ఏమాత్రం మార్పులు రాలేదని , మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలి అని కోరుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×